Breaking News

మంచు విష్ణుతో గొడవపై స్పందించిన మంచు మనోజ్‌.. ఏమన్నాడంటే..

Published on Mon, 03/27/2023 - 12:29

మంచు వారసుల వివాదం ఇటీవల ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. తన అన్న, మా అధ్యక్షుడు మంచు విష్ణు తన అనుచరులతో గొడవ పడుతున్న వీడియోను మనోజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘ఇళ్లలోకి వచ్చి ఇలా కొడుతుంటాడు మా వాళ్లను, బంధువులను.. ఇది సిచ్యువేషన్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే కాసేపటికే ఆ వీడియోను మనోజ్‌ డిలిట్‌ చేయడం గమనార్హం. తండ్రి మోహన్‌ బాబు సీరియస్‌ అవ్వడంతో మనోజ్‌ ఆ వీడియోను తొలగించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా వివాదంపై మనోజ్‌ స్పందించాడు.

ఓ మూవీ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న మనోజ్‌కు అన్న మంచు విష్ణు వీడియోపై స్పందించాల్సిందిగా విలేకర్లు ప్రశ్నించారు. దీనికి మనోజ్‌ స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ఇది నన్ను అడగకండి. నాకంటే అది మీడియాకే ఎక్కువ తెలుసు. వారినే అడగండి. నన్ను అడగోద్దు’ అంటూ సరదాగా కామెంట్స్‌ చేశాడు. అనంతరం మాట్లాడుతూ.. ‘నాకు సినిమానే లైఫ్‌, మీరే నా జీవితం. సినిమా లేకపోతే నాకు ఏం లేదు. మళ్లీ వస్తున్నా. వాట్‌ ద ఫిష్‌తో త్వరలోనే మీ ముందుకు వస్తున్నా. నాకు మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలి, ఇటివలె కొత్త జీవితం ప్రారంభించాను. మీ అందరు ఆశీర్వాదించి మాకు సంతోషకరమైన జీవితాన్ని ఇస్తారని కోరుకుంటున్నా’ అంటూ ముగించాడు. 

చదవండి: 
మంచు బ్రదర్స్‌ గొడవలో మూడో వ్యక్తి.. ఎవరీ సారథి? అసలేం జరిగింది..
గర్వంగా ఉంది నాన్న.. తనయుడికి చిరు స్పెషల్‌ విషెస్‌

Videos

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)