Breaking News

‘డేవిడ్‌ రెడ్డి’గా మంచు మనోజ్‌.. పోస్టర్‏తో అంచనాలు పెంచేశారే!

Published on Wed, 08/06/2025 - 11:47

వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు మనోజ్‌. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి నేటితో 21 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్బంగా కొత్త సినిమాను అనౌన్స్‌ చేశాడు. దీనికి ‘డేవిడ్‌ రెడ్డి’ అనే టైటిల్‌ పెట్టినట్లు ప్రకటిస్తూ.. పోస్టర్‌ని విడుదల చేశారు.

ఈ హిస్టారికల్‌ యాక్షన్‌ సినిమాకు హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నాడు. 1897 - 1922 మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందనుంది. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు అంశాలతో ఉత్కంఠభరితమైన కథతో సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో మనోజ్ మంచు ఇంతకు ముందు ఎన్నడూ చూడని అవతారంలో కనిపించనున్నారు. బ్రిటిష్ పాలనను సవాలు చేయడానికి కుల అణచివేత నుంచి లేచిన ధైర్యవంతుడైన తిరుగుబాటు దారుడిగా కనిపించబోతున్నాడట. టైటిల్‌ పోస్టర్‌తోనే సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశారు.

"మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించాడు, ఢిల్లీలో పెరిగాడు. ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించాడు" అంటూ మేకర్స్ ఇచ్చిన రైటప్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంతో పాటు ‘మిరాయ్‌’, వాట్‌ ది ఫిష్‌లోనూ మనోజ్‌ నటిస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)