Breaking News

విష్ణుని రెచ్చగొట్టేలా మంచు మనోజ్ మరో పోస్ట్!

Published on Fri, 05/30/2025 - 13:53

మంచు ఫ్యామిలీలో చాన్నాళ్లుగా గొడవలు సాగుతున్నాయి. వీటి గురించి మళ్లీ చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నిరోజులుగా మాత్రం విష్ణు, మనోజ్ సైలెంట్‌గానే ఉన్నారు. మనోజ్ కీలక పాత్రలో నటించిన 'భైరవం' సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ మనోజ్.. 'శివయ్య' అంటూ కామెంట్ చేశాడు. తర్వాత సారీ చెప్పాడు. ఇప్పుడు మరోసారి అన్న విష్ణుని రెచ్చగొట్టేలా ఓ పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ అయింది.

(ఇదీ చదవండి: అపస్మారక స్థితిలో 'హరిహర వీరమల్లు' నిర్మాత.. నిజమేంటి?)

'భైరవం' రిలీజ్ వేళ తండ్రితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మనోజ్.. 'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' అని మోహన్ బాబుతో కలిసున్న ఓ ఫొటోని పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో కేవలం మోహన్ బాబు-మనోజ్ మాత్రమే ఉండటంతో ఇదేదో విష్ణుని రెచ్చగొట్టేలా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.

చాలా ఏళ్లుగా సినిమాలు చేయడం మానేసిన మంచు మనోజ్.. 'భైరవం' మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇందులోబెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. తమిళ హిట్ మూవీ 'గరుడన్'కి రీమేక్ ఇది. అలానే తేజ సజ్జా హీరోగా నటించిన 'మిరాయ్' అనే పాన్ ఇండియా మూవీలో మనోజ్ విలన్‌గా నటించాడు. ఇది సెప్టెంబరులో రిలీజ్ కానుంది. మరోవైపు మంచు విష్ణు కూడా 'కన్నప్ప' మూవీతో చాన్నాళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జూన్ 27న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)