Breaking News

మంచు మనోజ్‌ అభిమానులపై మోహన్‌బాబు బౌన్సర్ల దాడి

Published on Wed, 01/15/2025 - 14:24

నటుడు మోహన్‌ బాబు (Mohan Babu) ఫ్యామిలీలో మరోసారి వివాదం రాజుకుంది. తిరుపతిలో మోహన్‌బాబుకు చెందిన శ్రీవిద్యానికేతన్‌ క్యాంపస్‌లోకి మనోజ్‌ (Manchu Manoj)- మౌనిక దంపతులు వెళ్లేందుకు ప్రయత్నించారు. మనోజ్‌ వస్తాడన్న సమాచారంతో యూనివర్సిటీ గేట్లను సిబ్బంది పూర్తిగా మూసివేశారు. సెక్యురిటీ సిబ్బంది ఎవరినీ లోనికి అనుమతించడం లేదు. 

మోహన్‌బాబు, విష్ణు (Manchu Vishnu) యూనివర్సిటీ వద్దే ఉన్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి యూనివర్సిటీకి మనోజ్‌ భారీ ర్యాలీతో రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా భారీగా మెహరించారు. క్యాంపస్‌కు చేరుకున్న మంచు మనోజ్‌ను సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మనోజ్‌.. అవ్వ, తాతల సమాధుల వద్దకు అనుమతించరా, గేట్లు తియ్యండి అంటూ కేకలు పెట్టాడు. ఈ క్రమంలో అవ్వ, తాతల సమాధుల వద్దకు వెళ్లేందుకు గేట్లు ఎక్కిన మనోజ్‌ అభిమానులపై మోహన్‌బాబు బౌన్సర్లు దాడి చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో పలువురికీ గాయాలయ్యాయి.

ఏం జరిగిందంటే?
కొద్దిరోజులుగా మంచు ఫ్యామిలీలో కలహాలు జరుగుతున్న విషయం తెలిసిందే! విష్ణు- మనోజ్‌కు మధ్య సత్సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. తండ్రితో సైతం గొడవలు తారా స్థాయికి చేరాయి. ఇదిలా ఉంటే మోహన్‌బాబు.. విష్ణుతో కలిసి తిరుపతిలో సంక్రాంతి పండగ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. అటు మనోజ్‌.. మెగా హీరోలు సాయిధరమ్‌ తేజ్‌, పంజా వైష్ణవ్‌తేజ్‌తో సంక్రాంతి జరుపుకున్నాడు.

తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ క్యాంపస్ వద్ద టెన్షన్ వాతావరణం

ఫ్లెక్సీల దగ్గర మొదలైన గొడవ?
పండగ సందర్భంగా మోహన్‌బాబు యూనివర్సిటీ నుంచి నారావారిపల్లె మనోజ్‌, విష్ణు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిన్న రాత్రికి రాత్రి మనోజ్‌కు సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించారట! ఈ నేపథ్యంలోనే మనోజ్‌.. యూనివర్సిటీకి ప్రయాణమవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ​మనోజ్‌ కాలేజీలోకి రావొద్దంటూ మోహన్‌బాబు ఇదివరకే కోర్టులో ఇంజెక్షన్‌ పిటిషన్‌ వేశారు. దీన్ని కోర్టు పరిగణలోకి తీసుకుని అనుమతిచ్చింది. 

అనుమతి లేదని చెప్పినా..
అటు పోలీసులు సైతం మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు. శాంతిభ్రదతల దృష్ట్యా యూనివర్సిటీలోకి అనుమతి లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు విశ్వ విద్యాలయం ప్రాంగణంలోకి అనుమతి లేదంటూ అందుకు సంబంధించిన న్యాయస్థాన ఉత్తర్వులను మనోజ్‌కు అందజేశారు. దీంతో యూనివర్సిటీ లోపలకు వెళ్లకుండానే మనోజ్‌ నారావారి పల్లెకు చేరుకున్నాడు. అక్కడ మంత్రి లోకేశ్‌తో భేటీ అయ్యాడు. ప్రస్తుతం తన ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై లోకేశ్‌తో చర్చించినట్లు సమాచారం. అనంతరం అభిమానులతో కలిసి మళ్లీ క్యాంపస్‌కు చేరుకున్నాడు.

చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’.. రాబోయే తెలుగు సినిమాలివే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)