Breaking News

కొత్త జంట మనోజ్‌-మౌనికలపై మంచు లక్ష్మి ఎమోషనల్‌ పోస్ట్‌

Published on Sun, 03/05/2023 - 11:43

అందరూ అనుకున్నట్టుగానే మంచు మనోజ్‌, భూమా మౌనిక రెడ్డిలు వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి నటి, మనోజ్‌ సోదరి మంచు లక్ష్మి నివాసం వేదికైంది. తమ్ముడి పెళ్లి బాధ్యత తీసుకున్న మంచు లక్ష్మి అన్ని దగ్గరుండి చూసుకుంది. ఈ వేడుకకు సంబందించిన హల్ది, మహెందీ ఫంక్షన్స్‌ నుంచి పెళ్లి వేడుక వరకు అన్నింటా మనోజ్‌ తరపున తనే పెళ్లి పెద్దగా వ్యవహరించినట్లు కనిపించింది. ఇక తమ్ముడిని పెళ్లి కొడుకును చేస్తూ మురిసిపోయింది. ఈ ఫొటో వివాహనికి ముందు బయటకు రాగా నెట్టింట వైరల్‌గా మారింది.

చదవండి: భార్యతో అత్తారింటికి బయలుదేరిన మనోజ్‌, భారీ కాన్వాయ్‌, బందోబస్తుతో..

ఇక అదే ఫొటోను షేర్‌ చేస్తూ అక్కకు కృతజ్ఞతలు చెప్పాడు మనోజ్‌. అంతేకాదు ‘ఏ జన్మ పుణ్యమో.. నువ్వు నాకు అక్కవు అయ్యావు’ అంటూ మనోజ్‌ ఎమోషనల్‌ అయ్యాడు. ఇదిలా ఉంటే విడాకుల అనంతరం ఒంటరి వాడు అయిన మనోజ్‌ మళ్లీ ఓ ఇంటివాడు కావడంతో మంచు లక్ష్మి భావోద్వేగానికి లోనైంది. పెళ్లి అనంతరం మౌనిక రెడ్డి మోహన్‌ బాబును పట్టుకుని ఏడ్చిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఇక ఎప్పటికీ వీరిద్దరు సంతోషంగా జీవిస్తారు’ అంటూ రెండు హార్ట్‌ ఎమోజీలను జత చేసింది. వీరి పెళ్లికి మోహన్‌ బాబు అభ్యంతరం చెప్పగా.. మొదటి నుంచి మంచు లక్ష్మి వీరికి మద్దతుగా ఉందని ఈ పెళ్లితో తెలిసిపోయింది.

చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. ఏ జన్మ పుణ్యమో..

అయితే ఎప్పటి నుంచో మంచు, భూమా కుటుంబాల మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో మనోజ్‌-మౌనికలు మంచి స్నేహితులు అయ్యారు. అయితే పెళ్లికి ఇరుకుటుంబాలు అభ్యంతరం చెప్పడంతో ఇద్దరు వేరువేరుగా లైఫ్‌ను స్టార్ట్‌ చేశారు. ఇక ఇద్దరి జీవితాల్లో పెళ్లి పెటాకులు కావడంతో.. వీరు పెళ్లి చేసుకోని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 3న మనోజ్‌-మౌనికలు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే నేడు ఉదయం మనోజ్‌ భార్యతో కలిసి అత్తారింటికి కర్నూలు బయలుదేరిన సంగతి తెలిసిందే. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)