Breaking News

మనోజ్‌ పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు మంచు లక్ష్మి ఏమందంటే?

Published on Mon, 02/13/2023 - 12:18

జీవితంలో కొత్త మజిలీ ప్రారంభించబోతున్నా, త్వరలోనే కొత్త చాప్టర్‌ అన్‌లాక్‌ చేస్తున్నా అంటూ ఊరించిన మంచు మనోజ్‌ చివరికి తన సినిమా అప్‌డేట్‌ చెప్పి అభిమానులను ఉసూరుమనిపించిన విషయం తెలిసిందే! అతడు గుడ్‌న్యూస్‌ అన్న క్షణం నుంచి ఫ్యాన్స్‌ అంతా కచ్చితంగా అది పెళ్లి వార్తే అయి ఉంటుందని ఫిక్స్‌ అయ్యారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ వాట్‌ ద ఫిష్‌ మూవీని ప్రకటించాడు. అయినప్పటికీ మనోజ్‌ త్వరలో పెళ్లిపీటలెక్కడం ఖాయమంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయం మంచు లక్ష్మీ చెవిన పడింది. ఆదివారం నాడు మంచు లక్ష్మీ తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకుంది.

ఈ సందర్భంగా ఆమెకు మంచు మనోజ్‌ రెండో పెళ్లి ఎప్పుడన్న ప్రశ్న ఎదురైంది. దీనికామె మాట్లాడుతూ.. 'నేను గుడికి వచ్చినప్పుడు పర్సనల్‌ విషయాలు అడగడం ఎంతవరకు కరెక్ట్‌? మనోజ్‌ పెళ్లి గురించి అతడినే అడగండి. నా సినిమాల గురించి అడిగితే చెప్తాను. అగ్ని నక్షత్రం సహా నాలుగు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. శివరాత్రికి ఓ పాట రిలీజ్‌ చేస్తున్నాను. టీచ్‌ ఫర్‌ చేంజ్‌ ఎన్జీవోలో ఓ ప్రోగ్రామ్‌ చేస్తున్నాం. 40 మంది యాక్టర్స్‌ వస్తున్నారు. దాని ద్వారా 45వేల మందికి మంచి విద్య అందించగలుగుతున్నాం. ఇవన్నీ నా పరిధిలోవి కాబట్టి చెప్పాను. నా పరిధిలో లేనివి అడిగితే చెప్పలేను' అని పేర్కొంది మంచు లక్ష్మి.

చదవండి: శంకర్‌ దర్శకత్వంలో క్రేజీ కాంబినేషన్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)