Breaking News

మా నాన్న దేవుడు: మంచు మనోజ్‌

Published on Wed, 12/11/2024 - 11:18

సాక్షి, హైదరాబాద్‌: మీడియా మిత్రులపై మా నాన్న(మంచు మోహన్‌బాబు) దాడి చేయడం బాధాకరమని, ఆయన తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను అన్నారు మంచు మనోజ్‌. మీడియాపై మోహన్‌బాబు చేసిన దాడిని ఖండిస్తూ ధర్నాకు దిగిన జర్నలిస్టులకు ఆయన మద్దతు తెలిపారు. తన కోసం వచ్చిన మీడియా మిత్రులపై దాడి చేయడం దారుణమన్నారు. తనపై మోహన్‌బాబు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. 

‘నేను ఆస్తుల కోసం ఏ రోజు కూడా గొడవ చేయలేదు. నా సొంత కాళ్లపై నిలబడుతున్నాను. నేను మద్యానికి బానిసై కొడుతున్నానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మా నాన్న దేవుడు.. ఇప్పుడు చూస్తున్న నాన్న మా నాన్న కాదు. ఆయన భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాలుస్తున్నారు. మా బంధువులపై దాడి చేశారు. నా భార్య, ఏడు నెలల పాపను గొడవలోకి లాగుతున్నారు. ఈ గొడవల మధ్య మా అమ్మ నలిగిపోతుంది. ఇన్ని రోజులు ఆగాను.. ఇక ఆగలేను. అసలేం జరిగింది? గొడవ దేనికోసం అనేది ఈ రోజు(డిసెంబర్‌ 11) సాయంత్రం ప్రెస్‌ మీట్‌ పెట్టి అన్ని విషయాలు చెబుతాను’ అని మంచు మనోజ్‌ అన్నారు.

(చదవండి: నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు)

కాగా, సీనియర్‌ నటుడు మోహన్‌బాబు ఫ్యామిలీ గొడవలు మంగళవారం తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద నిన్న రాత్రి వరకు హైడ్రామా నడిచింది. మంచు విష్ణు, మనోజ్‌ల బౌన్సర్ల మోహరింపు.. తోపులాటలతో ‘మంచు టౌన్‌’హీటెక్కింది. ఈ గొడవను కవర్‌ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు దాడి చేశాడు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పాలంటూ జర్నలిస్టులు అక్కడే ధర్నాకు దిగారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)