Breaking News

'మనశంకర వరప్రసాద్‌గారు'కి 50రోజులు.. ఫైనల్‌ కలెక్షన్స్‌ ఎంతో తెలుసా?

Published on Mon, 03/02/2026 - 11:51

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మనశంకర వరప్రసాద్‌గారు' 50రోజులు పూర్తి చేసుకుంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించగా.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి  ఆల్‌టైమ్‌ రీజనల్‌ ఇండస్ట్రీ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.  50రోజులు పూర్తి కావడంతో తాజాగా మేకర్స్‌ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.

'మనశంకర వరప్రసాద్‌గారు' 109 సెంటర్స్‌లో 50రోజులు పూర్తి చేసుకున్నట్లు అధికారికంగా మేకర్స్‌ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ (97), తెలంగాణ (5), కర్ణాటక (6), ఒరిస్సా(1) సెంటర్లలో విజయవంతంగా  ఈ మూవీ రన​్‌ అవుతుంది. అయితే, అనిల్‌ రావిపూడి- వెంకటేష్‌ కాంబినేషన్‌లో 2025 పొంగల్‌ కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా 92 కేంద్రాల్లో 50రోజులు పూర్తి చేసుకుంది.  ఇప్పుడు ఈ రికార్డ్‌ను   'మనశంకర వరప్రసాద్‌గారు' దాటేసింది.

'మనశంకర వరప్రసాద్‌గారు' ఫైనల్‌ కలెక్షన్స్‌
'మనశంకర వరప్రసాద్‌గారు' కేవలం 25రోజుల్లోనే రూ. 375 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆ తర్వాత నుంచి వారు కలెక్షన్స్‌ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఇండస్ట్రీ అంచన ప్రకారం ఈ చిత్రం ఫైనల్‌ కలెక్షన్స్‌ రూ. 395 కోట్ల వరకు ఉండొచ్చు అనే అంచనా వుంది. ఈ మూవీ సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు