Breaking News

డబుల్‌ సెలబ్రేషన్స్‌

Published on Sun, 10/05/2025 - 00:18

ఇక్కడున్న ఫొటోలో మంచి జోష్‌తో ఫుల్‌ ఖుషీగా కనిపిస్తున్నారు చిరంజీవి, వెంకటేశ్‌. ఇంతకీ ఈ జోష్‌కి కారణం ఏంటంటే... స్నేహితులను కలవడానికి వెళ్లారు. ప్రతి ఏడాది ‘క్లాస్‌ ఆఫ్‌ 80స్‌’ అంటూ 1980స్‌కి చెందిన నటీనటులందరూ కలిసి, సెలబ్రేట్‌ చేసుకుంటుంటారు. ఒక్కోసారి ఒక్కో థీమ్, ప్లేస్‌ ఉంటుంది. ఈసారి రీ యూనియన్‌కి  చెన్నై వేదికైంది.

ఇందు కోసమే చిరంజీవి, వెంకటేశ్‌ శనివారం హైదరాబాద్‌ నుంచి చెన్నై ప్రయాణం అయ్యారు. ఇదిలా ఉంటే... చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్‌గారు’లో ఓ కీలకపాత్రలో వెంకటేశ్‌ నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, వెంకటేశ్‌లపై కీలక సన్నివేశాలను, ఓ సెలబ్రేషన్‌ సాంగ్‌ను చిత్రీకరించడానికి  ప్లాన్‌ చేశారట.

‘‘చిరంజీవి, వెంకటేశ్‌గార్లను కలిసి సెట్స్‌లో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు అనిల్‌ రావిపూడి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.  ఇటు రీ యూనియన్‌ సెలబ్రేషన్స్‌ అటు సెట్స్‌లో సెలబ్రేషన్‌ సాంగ్‌... ఇలా ఈ నెల చిరంజీవి, వెంకటేశ్‌కు డబుల్‌ సెలబ్రేషన్స్‌ అని చెప్పుకోవచ్చు.  
 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)