Breaking News

'మన శంకర వరప్రసాద్‌గారు' ప్రతి ఇంటికి వచ్చేస్తున్నారు.. వివరాలు ఇవే

Published on Sat, 02/28/2026 - 13:35

చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా కీలకపాత్రలో వెంకటేశ్‌ నటించిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌గా ఫిబ్రవరి 28న సాయంత్రం 5:30 గంటలకు... మీ జీ తెలుగులో, జీ5లోనూ అందుబాటులో ఉండనుంది. శనివారం సాయంత్రం మీ ఇంట్లోనే బుల్లితెరపై చిరంజీవి హిట్‌ సినిమాను కుటుంబ సమేతంగా చూసేయండి.

చిరంజీవి హీరోగా నటించిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ మళ్లీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది. హిట్‌ మేకర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ హై–యాక్షన్‌ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ థియేట్రికల్‌ రన్‌లో భారీ వసూళ్లు సాధించి, ప్రశంసలు అందుకుంది. ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ గ్రాండ్‌ వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌గా ఫిబ్రవరి 28 శనివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో తప్పక చూడండి.

ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ ఫిబ్రవరి 11 నుంచి డిజిటల్‌ ప్లాట్‌ఫాం జీ5 వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. షైన్‌ స్క్రీన్స్, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. శంకర వరప్రసాద్‌ పాత్రలో చిరంజీవి కనిపించగా, నయనతార, వెంకటేశ్‌ దగ్గుబాటి, కేథరిన్‌ ట్రెసా, సచిన్‌ ఖేడేకర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం, సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం, తమ్మిరాజు ఎడిటింగ్‌తో ఈ సినిమా మరింత ఆకర్షణీయంగా మారింది.

హృదయాన్ని హత్తుకునే కుటుంబ భావోద్వేగాలు, నవ్వులు పూయించే కామెడీ, థ్రిల్లింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లతో అన్ని వయసుల ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్యాకేజీగా ఈ చిత్రం నిలిచింది. డిజిటల్‌ వేదికపై కూడా సెన్సేషన్‌ సృష్టించిన ఈ చిత్రం జీ5లో సంచలనాత్మకంగా 500 మిలియన్‌ స్ట్రీమింగ్‌ నిమిషాలను సాధించి ప్రేక్షకాదరణను మరింతగా చాటుకుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని జీ5, జీ తెలుగు వేదికగా మీరూ తప్పకుండా చూసేయండి!  మెగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మన శంకర వరప్రసాద్‌ గారు’... జీ5లో ఫిబ్రవరి 11 నుంచి, వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌గా ఫిబ్రవరి 28 సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో మిస్‌ కాకుండా చూసేయండి!  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)