'ఖైదీ 150' తర్వాత 'మన శంకర వరప్రసాద్ గారు' రికార్డ్‌

Published on Sun, 01/11/2026 - 21:08

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్‌ షోల విషయంలో దుమ్మురేపుతున్నాడు. హైదరాబాద్‌లో  ఏకంగా 200 స్క్రీన్స్‌లలో ప్రీమియర్స్‌ ప్రదర్శించనున్నారు.  రూ. 600 టికెట్‌ ఉన్నప్పటికీ దాదాపు అన్ని థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ అయ్యాయి. ఆపై నార్త్‌ అమెరికాలో కూడా టికెట్స్‌ బుకింగ్‌ జోరు కనిపిస్తుంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్‌ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. అమెరికాలో కేవలం ప్రీమియర్స్‌ ద్వారానే 9 లక్షల డాలర్లు (రూ. 8.12కోట్లు) కలెక్ట్‌ చేసినట్లు ప్రకటించారు.   1మిలియన్‌ మార్క్‌ కూడా చేరవచ్చని తెలుస్తోంది. దీంతో  చిరంజీవి కెరీర్‌లో మరో అతిపెద్ద ఓవర్సీస్ ఓపెనింగ్‌గా ఈ మూవీ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

‘మన శంకర వరప్రసాద్ గారు’ అమెరికా ప్రీమియర్స్‌లో సత్తా చాటుతున్నాడు. ప్రీమియర్స్‌ కలెక్షన్స్‌ పరంగా చిరు కెరీర్‌లో రెండో చిత్రంగా నిలిచింది. మొదటి స్ధానంలో ఖైదీ 150 మూవీ ఉంది. చిరు రీఎంట్రీ మూవీ కావడంతో కేవలం ప్రీమియర్స్‌ ద్వారా  1.25 మిలియన్‌ డాలర్స్‌ వచ్చాయి. ఆ తర్వాత అంతటి రేంజ్‌ ఓపెనింగ్స్‌ కలెక్షన్స్‌ ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి దక్కింది. అయితే, చిరు హిట్‌ సినిమా వాల్తేరు వీరయ్య కూడా 6 లక్షల డాలర్ల వద్దే ఆగిపోయింది.  సంక్రాంతి పండుగ కాబట్టి చిరు సినిమాకు పాజిటీవ్‌ టాక్‌ వస్తే తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా  ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిలిచే ఛాన్స్‌ ఉంది.

Videos

అయ్యా ABN మెంటల్ కృష్ణ.. రాధా కృష్ణ తుక్కు రేగొట్టిన నాగమల్లేశ్వరి

మిగిలేది ఆవకాయ తొక్కే.. బాబు, పవన్ పై బైరెడ్డి సెటైర్లే సెటైర్లు

కండలేరు వద్దకు వెళ్తున్న YSRCP నేతల అక్రమ అరెస్ట్

చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం.. పండగ పూట కూలీల పస్తులు

మన శంకరవరప్రసాద్ గారు మూవీ పబ్లిక్ టాక్

సంక్రాంతి కిక్కు.. జీవో రాకముందే మద్యం ధరల పెంపు

దళపతి విజయ్ అరెస్ట్..?

దూసుకొచ్చిన కారు.. సాక్షి రిపోర్టర్ కు గాయాలు

పెద్దపల్లి జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)

+5

సంక్రాంతి జోష్‌.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్‌ (ఫొటోలు)

+5

సాక్షి-ఎస్పీఆర్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు (ఫోటోలు)