Breaking News

నాలాగా మోసపోకండి.. నటుడి పోస్ట్‌ వైరల్‌

Published on Mon, 03/16/2026 - 15:24

ప్రతి మనిషిలోనూ జాలి, కరుణ, దయ అనేది ఉంటుంది. ఇవే ఇప్పుడు మోసగాళ్లకు పెట్టుబడిగా మారుతున్నాయి. సెంటిమెంట్‌తోనూ ‘కొట్టేస్తున్నారు’.  తాజాగా నటుడు, దర్శకుడు దేవీప్రసాద్‌ కూడా ఇలానే మోసపోయాడు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేస్తే.. రూ. 6వేలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడట. ఆ తర్వాత కూడా పదే పదే డబ్బులు అడగడంతో అనుమానంతో ఆరా తీస్తే.. అతనో మోసగాడని తెలిసిందంట. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ.. తనలాగా ఇంకెవరు మోసపోవద్దని దేవీప్రసాద్‌ కోరాడు.

అసలేం జరిగింది?
గత నెలలో దేవిప్రసాద్‌కు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చిందట. ‘నమస్తేసర్. నేను లింగా... గుర్తున్నానా సర్’ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడట. శ్రీరంగనీతులు సినిమాలో మీతో కలిసి నటించాను అంటూ.. సెంటిమెంట్‌ డ్రామా స్టార్ట్‌ చేశాడట. ‘ఎలా చెప్పాలో అర్ధం కావటంలేదు సర్.కొన్నిరోజులుగా మలక్‌పేట యశోదాహాస్పిటల్ లో మా అమ్మగారు సీరియస్‌గా ఉన్నారు.మా దగ్గర డబ్బులు అయిపోయాయి .ఆరోగ్యశ్రీలాంటి కార్డులేవీలేవు. తెలిసినవాళ్ళు బెంగుళూరు షిఫ్ట్ చేస్తే ఫ్రీగా ట్రీట్‌మెంట్ చేయిస్తామన్నారు. అంబులెన్స్ కి 16 వేలు అడిగారు.పదివేలు దొరికాయి.6 వేలు తక్కువయ్యింది.టైమ్ లేదుసర్.ఏంచేయాలో అర్ధంకాక మీకు కాల్ చేశాను’ అని దీనంగా అడుగుతూ..ఆక్సిజన్ మాస్క్‌ఉన్న పెద్దావిడ ఫోటో,హాస్పిటల్‌లో ఓ ప్రదేశం ఫోటోలు పెట్టడంతో నిజమే అనుకొని దేవీప్రసాద్‌ రూ. 6 వేలు గూగుల్‌ పే ద్వారా పంపించారట.

అలా దొరికిపోయాడు
మరుసటి రోజు కూడా మళ్లీ కాల్‌ చేసి ఆపరేషన్‌ కోసం కొంత డబ్బులు కావాలని అడగడంతో దేవీప్రసాద్‌కి అనుమానం వచ్చిందట. శ్రీరంగనీతులు సినిమాకి పనిచేసినవాళ్ళకు కాల్ చేసి లింగారెడ్డి గురించి అడిగితే.. ఆ పేరుతో ఉన్నవాళ్లెవరు ఈ సినిమాలో పని చేయలేదని చెప్పారట. అంతేకాదు  ఆ సినిమా పేరుచెప్పి రెండునెలలక్రితం హీరోని కూడా ఇలానే డబ్బులు అడిగారని చెప్పడంతో దేవికి అసలు విషయం తెలిసిపోయింది. మూడు రోజుల తర్వాత అవే ఫోటోలను పంపించి భాషా అనే నటుడి దగ్గర కూడా అలానే చెప్పాడట. అయితే దేవిప్రసాద్‌ ద్వారా భాషాకు ముందే అతని గురించి తెలియడంతో లొకేషన్‌ పెట్టమని అడిగాడట. అతను హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌కి మూడు వీధుల అవతలున్న ఓ లొకేషన్ పెట్టాడట. వెంటనే దేవిప్రసాద్‌ ఫోన్‌ చేసి ఇప్పుడెక్కడున్నారు అని అడిగితే బెంగుళూరులో జయదేవ్ హాస్పిటల్‌లో ఉన్నాం, ట్రీట్‌మెంట్ జరుగుతుందని చెప్పాడట. దీంతో దేవిప్రసాద్‌ అతనిపై సీరియస్‌ అయ్యాడట. ఇలా తల్లిసెంటిమెంట్‌తో తనని మోసం చేశాడని.. తనలాగా ఎవరూ మోసపోవద్దనే ఈ పోస్ట్‌ పెడుతున్నానంటూ జరిగిన విషయం మొత్తం రాసుకొచ్చాడు. 
 

Videos

ప్రజా దర్బార్ లో పేదలను అవమానించిన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ

103 డాలర్లకు చమురు ధర

దొంగచాటుగా హర్ముజ్ జలసంధిని దాటుతున్న నౌకలు

కూటమి తీరుపై రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ భారీ నిరసన

సీపీ సతీమణి ఏకే 47 గన్ తో 10 రౌండ్ల కాల్పులు

శత్రుల రాడార్లను ముప్పు తిప్పలు పెట్టె ఇరాన్ మిస్సైల్

Sec-Bad: 800 కిలోల కుళ్లిన చికెన్

ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు.. BR నాయుడు రాసలీలలపై జగన్ సెటైర్లు

ఇది కదా తండ్రి ప్రేమంటే కొడుకు పరీక్ష కోసం ఏం చేశాడంటే

లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నటి మంచు లక్ష‍్మి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

తమ్ముడి పిల్లల బర్త్‌డే వేడుకల్లో మహేశ్‌ బాబు (ఫోటోలు)

+5

ఆస్కార్‌ వేడుకలో మెరిసిన వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా.. (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ హల్దీ వేడుక.. (ఫొటోలు)

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)