Breaking News

మెగాస్టార్ సరికొత్త హారర్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే!

Published on Tue, 02/13/2024 - 19:29

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'భ్రమయుగం'. ఈ చిత్రానికి 'భూతకాలం' ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు.  ఇప్పటికే రిలీజైన ఈ మూవీ పోస్టర్స్‌ 'భ్రమయుగం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్. 

చాలా కాలం తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ఈ సినిమా కథ కేరళలో మాయ/తంత్రంతో నిండిన యుగంలో నడుస్తుంది. ఒక సింగర్ జీవితంలో జరిగిన అనూహ్య ఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ముందుగా మలయాళం భాషలో మాత్రమే విడుదల చేయాలని తాజాగా మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. కాగా.. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతమందించారు. 

ఈ చిత్రంలో విలన్‌లు, హీరోలు లేరని మెగాస్టార్ మమ్ముట్టి అన్నారు. విలన్‌లు, హీరోలు అనే కాన్సెప్ట్‌ కూడా లేని కాలంలో 'భ్రమయుగం' తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనా పాత్ర చాలా మిస్టరీగా ఉంటుందని తెలిపారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో భాగమైనందుకు మమ్ముట్టి సంతోషం వ్యక్తం చేశారు. 

మమ్ముట్టి మాట్లాడుతూ.. 'గతంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చాలా వచ్చాయి. ఫ్లాష్‌బ్యాక్‌లను బ్లాక్ అండ్ వైట్‌లో చూపించేవాళ్లం. ఇప్పటికీ చాలా మంది చేస్తున్నారు. అయితే ఇలాంటి సినిమాల జోలికి వెళ్లకపోవడం వల్ల యువత పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో సినిమా చూడటం ఇప్పుడు కొత్త అనుభూతిని కలిగిస్తుంది' అని అన్నారు. 

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)