లేనప్పుడే విలువ తెలుస్తుంది.. అనారోగ్యంపై తొలిసారి స్పందన

Published on Wed, 02/18/2026 - 12:09

మలయాళ స్టార్‌ మమ్ముట్టి గతేడాది జూన్‌లో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కొంతకాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించాడు. ఆరోగ్యం కుదుటపడ్డాకే తిరిగి సినిమాల్లో యాక్టివ్‌ అయ్యాడు. తాజాగా ఆయన తొలిసారి తన అనారోగ్యం గురించి మాట్లాడాడు. మనిషికి కంటిచూపు, వినికిడి చాలా ముఖ్యమైనవి. అయితే శ్వాస తీసుకునేటప్పుడు ఏ వాసన రాకపోతే కొంత ఆందోళన కలుగుతుంది. నేను కూడా కొంతకాలం అలాంటి ఇబ్బందే ఎదుర్కొన్నాను. 

లేనప్పుడే విలువ తెలుస్తుంది
చాలాకాలం రుచి, వాసన కోల్పోయాను. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా వాటిని తిరిగి పొందుతున్నాను. అయితే ఆ సామర్థ్యాలను కోల్పోయినప్పుడే వాటి విలువ మనకు అర్థమవుతుంది. వినడం, వాసన గ్రహించడం, రుచి చూడటం వంటి సామర్థ్యాల ప్రాధాన్యత చాలామంది పట్టించుకోరు. వాటి శక్తి నెమ్మదించినప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఎవరైనా గట్టిగా మాట్లాడుతుంటే చిన్నగా మాట్లాడమని చెప్తాం. ఎందుకంటే మనం వినగలుగుతున్నాం. కానీ వినికిడి శక్తి లేనివారు ఏదీ అనకుండా సైలెంట్‌గా ఉంటారు. ఎవరెలా మాట్లాడినా వారికి తేడా ఉండదు. వినగలగడం కూడా ఒక వరం అని చెప్పుకొచ్చాడు.

కెరీర్‌
మమ్ముట్టి 1951 సెప్టెంబర్‌ 7న కేరళలోని అలప్పుళ జిల్లా చండీరూర్‌లో జన్మించాడు. ఎల్‌ఎల్‌బీ డిగ్రీ చదివిన ఆయన రెండేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశాడు. 1971లో అనుభవంగళ్‌ పాలిచకల్‌ మూవీలో ఓ చిన్నపాత్రతో నటన ప్రారంభించాడు. విల్కన్‌ ఉండూ స్వప్నంగళ్‌ సినిమాతో హీరోగా మారాడు. ఏడాదికి ఇరవైకి పైగా సినిమాలు చేశాడు. అలా దాదాపు 400కి పైగా చిత్రాల్లో నటించాడు. సినీ పరిశ్రమలో ఆయన అందించిన సేవలకుగానూ మమ్ముట్టికి పద్మభూషణ్‌ అవార్డు వరించింది. ప్రస్తుతం ఈయన పాత్ర, పేట్రియాట్‌ సినిమాల్లో నటిస్తున్నాడు.

చదవండి: హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అని పిలిచి అవమానం: సుహాస్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)