Breaking News

రూ. 100 కోట్ల క్లబ్‌ చేరువలో 'మమ్ముట్టి' సినిమా

Published on Tue, 12/16/2025 - 09:01

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి మరో భారీ హిట్‌ అందుకున్నారు. 74 ఏళ్ల వయసులో ఆయన హీరోగానే కాకుండా  నెగెటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలతోనూ మెప్పించారు.  ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ‘కలాంకావల్‌’(Kalamkaval)లో తాను విలన్‌ పాత్రలో నటించారు. డిసెంబర్‌ 5న మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరనుంది.

ఈ ఏడాది ప్రారంభంలో ‘డొమినిక్‌ అండ్‌ ది లేడీస్‌ పర్స్‌’ అనే మిస్టరీ కామెడీ థ్రిల్లర్‌ సినిమాతో మెప్పించిన మమ్ముట్టి(Mammootty) ఇప్పుడు  కలాంకావల్‌(Kalamkaval) అనే మూవీతో భారీ విజయం అందుకున్నారు. ఎప్పుడూ కూడా వైవిధ్యమైన పాత్రలతో, కథలతో మమ్ముట్టి ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తారు. ఈ చిత్రంలో కూడా ఆయన మానసిక రోగి పాత్రను పోషించారు. దర్శకుడు జితిన్ కె. జోస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై  విమర్శకులు, ప్రేక్షకుల నుండి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. రెండు వారాలకు గాను ‘కలాంకావల్‌’ చిత్రం కేవలం మలయాళంలోనే రూ. 75 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం చాలా థియేటర్స్‌లో మంచి కలెక్షన్స్‌తో రన్‌ అవుతుంది. దీంతో మరో వారంలోపు రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మమ్ముట్టి కంపెనీ ప్రొడక్షన్స్‌ నిర్మించిన ‘కలాంకావల్‌’లో వినాయకన్,  మీరా జాస్మిన్‌, జిబిన్‌ గోపీనాథ్, గాయత్రి అరుణ్, రజిషా  విజయన్‌  ప్రధాన పాత్రల్లో  నటించారు. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే విడుదలైన ఈ మూవీ.. ఓటీటీలో మాత్రం తెలుగు వర్షన్‌ కూడా స్ట్రీమింగ్‌కు రానుంది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)