Breaking News

యాత్ర 2.. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ అవుట్‌.. ఒక్కటి గుర్తుపెట్టుకోండి!

Published on Mon, 10/09/2023 - 11:56

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'యాత్ర'. 2019లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! యాత్ర 2 లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి, వైఎస్‌ జగన్‌ పాత్రలో కోలీవుడ్‌ స్టార్‌ జీవా నటిస్తున్నారు. మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి, వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి పాత్రలకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది.

పోస్టర్‌లో మ‌మ్ముట్టి, జీవా ఇన్‌టెన్స్ లుక్స్‌తో క‌నిపిస్తున్నారు. ‘నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి...నేను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుని’ అనే ఎమోషనల్ డైలాగ్‌ను కూడా పోస్ట‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. పోస్ట‌ర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఏపీ దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయ‌కుడిగా ఎదిగిన తీరుని, 2009 - 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఇప్పుడు ‘యాత్ర 2’ని తెర‌కెక్కిస్తున్నారు.

‘యాత్ర’ చిత్రాన్ని 2019లో ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం శ‌ర‌వేగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మది కెమెరామెన్. సంతోష్ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

చదవండి: కొత్త కంటెస్టెంట్ల చేతిలో నామినేషన్స్‌ ప్రక్రియ.. అమర్‌, తేజలకు..

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)