Breaking News

Yatra 2 Teaser: ఆకట్టుకుంటున్న 'యాత్ర 2' టీజర్

Published on Sat, 01/06/2024 - 02:08

‘ఏన్నా.. ఇంత రాత్రి అయినా నిద్ర పోకుండా ఈడ ఏం చేస్తున్నావన్నా’ అంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రధారి జీవా డైలాగ్‌తో ‘యాత్ర 2’ టీజర్‌ విడుదలైంది. ‘యాత్ర’ వంటి హిట్‌ మూవీకి సీక్వెల్‌గా మహి వి. రాఘవ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో జీవా నటిస్తున్నారు. త్రీ ఆటమ్‌ లీవ్స్, వీ సెల్యూలాయిడ్‌తో కలసి శివ మేక నిర్మిస్తున్న ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న విడుదల కానుంది.

ఈ సినిమా టీజర్‌ని శుక్రవారం రిలీజ్‌ చేశారు. ‘మా వైఎస్‌ఆర్‌ కొడుకు వస్తున్నాడంట.. ఆయన కోసం ఎదురు చూస్తున్నానన్నా’ (వైఎస్‌ఆర్‌ అభిమాని), ‘కాదన్నా.. మీ వైఎస్‌ఆర్‌ కొడుకు వచ్చి మీ ముందు నిల్చున్నా మీకు కనపడదు కదా అన్న’ (జీవా), ‘నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకు కనపడతా కదా అన్న, నాలాంటోళ్లు ఆయన వెనకాల ఉన్నామని తెలియడానికే నేను ఇక్కడున్నానన్నా’ (వైఎస్‌ఆర్‌ అభిమాని), ‘నా రాజకీయ ప్రత్యర్థినైనా, శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ, మీ నాయకుడిలాగా వాళ్ల నాశనం కోరుకోనయ్యా’ (వైఎస్‌ఆర్‌ పాత్రధారి మమ్ముట్టి) వంటి డైలాగులు టీజర్‌లో ఉన్నాయి.

2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మహి వి. రాఘవ్‌. మహేశ్‌ మంజ్రేకర్, సుజానె బెర్నెర్ట్, కేతకీ నారాయణన్, ‘శుభలేఖ’ సుధాకర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)