Breaking News

ప్రేమలు బ్యూటీ 'మమితా బైజు'కు రెబల్‌ షాక్‌

Published on Sun, 03/24/2024 - 07:31

మలయాళంలో విజయవంతమైన ‘ప్రేమలు’ సినిమాతో మమితా బైజు పేరు బాగా వైరల్‌ అయింది. తెలుగులో కూడా ప్రేమలు పేరుతో రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో విడుదల చేశారు. ఇక్కడ కూడా భారీగానే ప్రేక్షకులను మెప్పించింది. కానీ మార్చి 22 ఈ బ్యూటీ నటించిన మరో సినిమా విడుదలైంది.  ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, నేహా జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో పాన్‌ ఇండియా రేంజ్‌లో 'రెబెల్‌' అనే సినిమాను కోలీవుడ్‌లో నిర్మించారు. 

ఈ చిత్రంలో మమితా బైజు- జీవీ.ప్రకాశ్‌కుమార్ జోడీగా నటించారు.  సంగీత దర్శకుడిగా, నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు ఉన్న విషయం తెలిసిందే. రెబెల్ సినిమా విషయానికి వస్తే.. 1980లలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. ఈ సినిమాకు అరుణ్ కృష్ణ, రాధాకృష్షన్, వెట్రే క్రిష్ణనమ్ లాంటి టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ పనిచేశారు. దీంతో ఈ సినిమా కోసం సుమారుగా రూ. 40 కోట్ల బడ్జెట్‌ అయినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. రెబల్‌ సినిమాకు విడుదలైన మొదటి ఆటతోనే మిశ్రమ స్పందన వినిపిస్తోంది.

రెండు విద్యార్ధి వర్గాల మధ్య మొదలైన సంఘర్షణ రాష్ట్ర రాజకీయాల దాకా విస్తరించడం. ఆపై ర్యాగింగ్, కుల వివక్ష, పొలిటిక్స్ ఇలా అన్ని అంశాలు తెరపై కనిపించడం అయితే బాగుంది కానీ అందుకు తగ్గట్లు నికేష్ ఆర్ఎస్ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదని చెప్పవచ్చు. ఈ చిత్రంలో మమితా బైజు పాత్రకు కూడా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. దీంతో రెబెల్‌ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగలడం దాదాపు ఖాయం అని అప్పుడు కొందరు లెక్కలేస్తున్నారు. రెబల్‌ మొదటిరోజు కలెక్షన్స్‌  తమిళనాడులో రూ. 1.5 కోట్లు,కన్నడలో రూ. 75 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ. 30 లక్షలు మాత్రమే వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు. ప్రారంభంలోనే ఇంత పేలవంగా కలెక్షన్స్‌ ఉంటే ఫైనల్‌గా దారుణమైన నష్టాలు రావడం ఖాయం అని చెప్పవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)