Breaking News

మరో లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ!

Published on Sat, 03/01/2025 - 08:11

ఒక్క సక్సెస్‌ కోసం పోరాడితే చాలు. ఆ తరువాత అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇది అందరికీ జరగకపోయినా, చాలా మంది విషయంలో జరిగేది ఇదే. నటి మమిత బైజు(Mamitha Baiju ) ఇందుకు ఒక ఉదాహరణ. ప్రేమలు అనే మలయాళం చిత్రంతో మాలీవుడ్‌నే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్‌ ప్రేక్షకులను మైమరిపించిన కథానాయకి ఈ బ్యూటీ. ఆ తరువాత మాతృభాషలోనే కాకుండా ఇతర భాషల్లోనూ అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా తమిళంలో జీవీ ప్రకాశ్‌ కుమార్‌కు జంటగా రెబల్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ఇక్కడ మరిన్ని అవకాశాలు అందుకుంటున్నారు. 

అలా రెండో అవకాశమే దళపతి విజయ్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింది. అదీ ఆయన నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్‌లో కావడం విశేషం. ఇందులో చాలా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అదే లక్కు అనుకుంటే తాజాగా మరో క్రేజీ అవకాశం ఈమెను వరించింది. అవును దర్శకుడు, కథానాయకుడిగా వరుసగా విజయాలను అందుకుంటున్న నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ తదుపరి చిత్రంలో కథానాయికిగా మమిత బైజూ నటించబోతున్నారన్నది తాజా సమాచారం. 

ఈ చిత్రం ద్వారా దర్శకురాలు సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే పూర్తి వివరాలతో వెలువడే అవకాశం ఉంది. మొత్తం మీద డ్రాగన్‌ చిత్రంతో పెద్ద విజయాన్ని అందుకున్న నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌తో జత కట్టే అవకాశాన్ని దక్కించుకున్న నటి మమిత బైజు నిజంగా లక్కీనే.  

Videos

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)