Breaking News

రాజమౌళి అలా అనడంతో నా గుండె పగిలింది: హీరోయిన్‌

Published on Thu, 02/23/2023 - 14:57

తెలుగులో తొలి చిత్రం 'యమదొంగ'తో బాగా పాపులర్‌ అయిన హీరోయిన్‌ మమతా మోహన్‌దాస్‌ 2010, 13లో రెండు సార్లు క్యాన్సర్‌ బారిన పడింది. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకుని కోలుకుంది. ఇటీవలే చర్మం రంగు మారడం అనే విటిలిగో వ్యాధి బారిన పడగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఓపక్క అనారోగ్యంతో పోరాడుతూనే మరోపక్క సినిమాలు చేస్తూ కెరీర్‌ బ్యాలెన్స్‌ చేసుకుంటోంది. కాగా గతంలో మమత సూపర్‌ హిట్‌ మూవీ 'అరుంధతి'ని చేజార్చుకున్న విషయం తెలిసిందే! తాజాగా తాను చేసిన పొరపాటు గురించి ఓ ఇంటర్వ్యూలో మరోసారి మాట్లాడిందీ నటి.

'రాజమౌళి సర్‌ నాకు ఫోన్‌ చేసి యమదొంగ చేయమని అడిగారు. దానికంటే ముందే శ్యామ్‌ ప్రసాద్‌ అరుంధతి ఛాన్స్‌ వచ్చింది. ఆ సినిమాకు సంతకం చేశాను. కానీ ఆ ప్రొడక్షన్‌ మంచిది కాదని మేనేజర్‌ చెప్పారు. నాకు తెలుగు ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు కాబట్టి వెనకడుగు వేశాను. శ్యామ్‌ ప్రసాద్‌ గారు రెండు, మూడు నెలలపాటు అడిగారు.. కానీ నేను మాత్రం కుదరదన్నాను. దీని గురించి రాజమౌళి సర్‌ మాట్లాడుతూ.. అరుంధతి సినిమా నువ్వు చేయాల్సింది. వదిలేసి చాలా పెద్ద తప్పు చేశావన్నారు. ఆయన అలా అనడంతో నా గుండె పగిలిపోయినట్లయింది. అప్పటికి ఆ సినిమా ఇంకా రిలీజ్‌ కాలేదు' అని చెప్పుకొచ్చింది మమతా మోహన్‌దాస్‌.

చదవండి: మరణానికి ముందు శ్రీదేవి ఎలా ఉందంటే? చివరి ఫోటో వైరల్‌

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు