ఓటీటీలో రియల్‌స్టోరీతో సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Published on Sun, 07/07/2024 - 07:55

ఈ ఏడాదిలో తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా మెప్పించిన సినిమాలు మలయాళం నుంచే ఉన్నాయి. 2024 శాండల్‌వుడ్‌ చిత్రపరిశ్రమకు బాగా కలిసొచ్చిన సంవత్సరం అని కూడా చెప్పవచ్చు. ఈ క్రమంలో వచ్చిన మరొక చిత్రమే 'మలయాళీ ఫ్రమ్ ఇండియా'. మే 1న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ తెచ్చుకుంది. నివిన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాసన్, అనస్వర రాజన్ ఇందులో నటించారు. ఈ సినిమాను డిజో జోస్ ఆంటోనీ డైరెక్ట్ చేశాడు. జనగణమన సినిమా హిట్‌ తర్వాత 'మలయాళీ ఫ్రమ్ ఇండియా'ను ఆయన తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది.

మలయాళీ ఫ్రమ్ ఇండియా అనే చిత్రాన్ని యథార్థంగా జరిగిన సంఘటనలను బేస్‌ చేసుకుని తెరకెక్కించారు. కథలో బలం ఉండటంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయింది. అయితే, ఈ సినిమా సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఆకతాయిగా ఉన్న ఒక యువకుడు ఊహించని ఘటనతో తన ఇల్లు వదిలి దుబాయ్‌ వెళ్లిపోతాడు. అక్కడికి చేరుకున్న తర్వాత అతని జీవితం ఎలా మారిపోయింది..? గ్రామంలో ఆకతాయిగా ఉన్న ఆ యువకుడి జీవితంలో వచ్చిన మార్పు ఏంటి..? ముఖ్యంగా క్లైమాక్స్ సీన్‌ ఎలా మెప్పించింది..? వంటి అంశాలు తెలియాలంటే మలయాళీ ఫ్రమ్ ఇండియా చూడాల్సిందే. 

ఫస్టాఫ్‌లో సినిమా కాస్త బోర్‌గా అనిపిస్తుంది. కొంత సమయం తర్వాతా చాలా ఆసక్తిగా కథ ఉంటుంది. మస్ట్ వాచెబుల్ సినిమా అని చెప్పవచ్చు. యథార్థ సంఘటనల ద్వారా తీసిన ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూసేయ్యండి. చివరి 30 నిమిషాలు సినిమాకి ప్రధాన బలం అని చెప్పవచ్చు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)