Breaking News

ఏడాది తర్వాత ఓటీటీకి వస్తోన్న మిస్టరీ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Wed, 05/28/2025 - 16:54

ఓటీటీలో క్రైమ్ జోనర్‌ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ముఖ్యంగా క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌ చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. అందువల్లే అభిమానుల అభిరుచికి తగినట్లుగానే అలాంటి సినిమాలే ఎక్కువ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక మలయాళ సినిమాలకు ఓటీటీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అందుకే మాలీవుడ్‌ సినిమాలు ఓటీటీల్లో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటున్నాయి.

తాజాగా మరో మలయాళ మిస్టరీ థ్రిల్లర్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ ఈ నెలలోనే ఓటీటీలో సందడి చేయనుంది.  బినో అగ‌స్టీన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బిగ్‌బెన్‌ మూవీ ఈనెల 30 నుంచే సన్‌ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్‌ సినిమాలో అనుమోహ‌న్‌, విన‌య్ పోర్ట్‌, అదితి ర‌వి, మియా జార్జ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమాను యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు.

కాగా.. ఈ ఏడాది మార్చిలోనే  ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు స‌న్ నెక్స్ట్ ప్ర‌క‌టించింది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా పడింది. చివరికీ ఈ శుక్ర‌వారం బిగ్‌బెన్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. గ‌త ఏడాది జూన్ నెలాఖ‌రున ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ మూవీలో హీరోయిన్‌గా న‌టించిన మియా జార్జ్ తెలుగులోనూ నటించింది. ఉంగ‌రాల రాంబాబు మూవీలో సునీల్‌కు జోడీగా క‌నిపించింది. ఆమె  న‌టించిన‌ పలు త‌మిళ, మ‌ల‌యాళ సినిమాలు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చాయి.
 

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)