Breaking News

ఎనిమిది రాష్ట‍్రాలు.. నాలుగు దేశాలు.. 14 నెలల జర్నీ: మోహన్ లాల్

Published on Sun, 12/01/2024 - 19:45

మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ఎంపురన్ (లూసిఫర్-2). 2019లో విడుదలైన లూసిఫర్‌కు సీక్వెల్‌గా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మోహన్‌లాల్ వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా పోస్ట్ చేశారు.

మోహన్‌ లాల్ తన ట్వీట్‌లో రాస్తూ..' ఎంపురాన్ 14 నెలల అద్భుతమైన ప్రయాణం. ఎనిమిది రాష్ట్రాలతో పాటు యూఎస్‌, యూకే, యూఏఈ సహా దాదాపు నాలుగు దేశాల్లో పర్యటించాం. ప్రతి ఫ్రేమ్‌ని ఎలివేట్ చేసే సృజనాత్మకత, అద్భుతమైన దర్శకత్వం పృథ్వీరాజ్ సుకుమారన్ సొంతం. స్క్రీన్‌ ప్లేతో కథకు ప్రాణం పోసిన మురళీ గోపీకి  ధన్యవాదాలు. మాపై నమ్మకం ఉంచి ఎంతోగానో సపోర్ట్‌ చేసిన సుభాస్కరన్, లైకా ప్రొడక్షన్స్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక నటుడిగా నా ప్రయాణంలో ఎంపురాన్ ఒక గొప్ప అధ్యాయం. ఈ కథకు పనిచేసిన తారాగణం, సిబ్బంది లేకుండా ఇవేవీ సాధ్యం కాదు.  మీ ప్రేమ, మద్దతు మాకు అడుగడుగునా స్ఫూర్తినిస్తాయి.'  అని  రాసుకొచ్చారు.

కాగా.. లూసిఫర్‌ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ సుకుమార్‌, మంజు వారియర్‌, టొవినో థామస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూట్‌ ప్రారంభించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)