Breaking News

ఇరుగుపొరుగు చూస్తున్నారు జాగ్రత్త!

Published on Tue, 01/28/2025 - 00:02

ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం సూక్ష్మదర్శిని ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

ఈ ప్రపంచంలో దాచలేనిది ఏదైనా ఉందీ అంటే అది రహస్యమే. కానీ మనిషి తన రహస్యాన్ని బంధించగలనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికైనా రహస్యమనేది బహిర్గతమవ్వాల్సిందే. కాకపోతే ఆ రహస్యాన్ని మన ఊహకు కూడా అందనివాళ్లు బయటపెడితే అది పెద్ద విడ్డూరం. మన రహస్యాన్ని మన ఇరుగుపోరుగు వారు బయటపెడితే మనకెలా ఉంటుంది.. ఆ పంథాన రూపొందించిన సినిమానే ‘సూక్ష్మదర్శిని’(sookshmadarshini). ఓ రకంగా చెప్పాలంటే ఇదో వినూత్న కథ, కథతో పాటు స్క్రీన్‌ప్లే  కూడా అంతే వైవిధ్యంగా నడుస్తుంది. ‘సూక్ష్మదర్శిని’ ఓ మళయాళ సినిమా.

హాట్‌ స్టార్‌లో తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికొస్తే... ఇది ఓ కాలనీకి సంబంధించినది. ప్రియ తన భర్త ఆంటోని, కూతరు కాణితో అదే కాలనీలో నివసిస్తుంటుంది. ప్రియ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటుంది. ప్రియకి అదే కాలనీలో ఉంటున్న స్టెఫీ, అస్మా మంచి స్నేహితులు. ఓ రోజు ఆ కాలనీలోని ఓ ఇంట్లోకి మాన్యుల్‌ తన తల్లితో కొత్తగా చేరతాడు. తన తల్లికి అల్జీమర్స్‌ వ్యాధి ఉందని చెప్పి కొంత వింతగా ప్రవర్తిస్తుంటాడు మాన్యుల్‌. తన ప్రవర్తన ప్రియకి అనుమానాస్పదంగా అనిపిస్తుంది. ఈ విషయంపై ప్రియ ఫోకస్‌ చేసి స్టెఫీ, అస్మాతో కలిసి అసలు నిజం బయటపెడుతుంది.

మాన్యుల్‌ ప్రవర్తించిన తీరు ఏంటి, ప్రియ వాళ్లు ఇన్వెస్టిగేట్‌ చేసి బయట పెట్టిన సంగతేంటి అన్న విషయాలు మాత్రం ‘సూక్ష్మదర్శిని’లో చూస్తే తెలిసిపోతుంది. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఆఖరున వచ్చే అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకి దర్శకుడు యం.సి. జతిన్‌. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్(Nazriya Nazim), బాసిల్‌ జోసెఫ్‌(Basil Joseph) వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆఖరుగా ఒక్క మాట... ఇరుగు పోరుగు వారు మనతో కలిసి ఉంటే మంచిదే, అలాగే వాళ్లు మనల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నారో లేదో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనల్ని ఏ సూక్ష్మదర్శిని ఏమీ చేయదు. వర్త్‌ఫుల్‌ వాచ్‌ ఫర్‌ ది వీకెండ్‌. – ఇంటూరు హరికృష్ణ

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)