Breaking News

OTT Movie Review: వీడి జాతకంలో పెళ్లి లేదా?

Published on Mon, 04/14/2025 - 00:17

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ఒరు జాతి జాతకం(Oru Jati Jathakam) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

కల్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. కానీ పెళ్లి యోగమే లేని మన కథానాయకుడు తన పెళ్లి కోసం చేసే ప్రయత్నాల హడావిడే ఈ ‘ఒరు జాతి జాతకమ్‌’ సినిమా. గతంలో ఇదే కథాంశం మీద ఎన్నో సినిమాలు వచ్చి ఉండొచ్చు గాని ఈ సినిమా మాత్రం డిఫరెంట్‌. ఇంకా చె΄్పాలంటే... ఇదో హైబ్రిడ్‌ పీస్‌. మోహనన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వినీత్‌ శ్రీనివాసన్‌ కథానాయకుడు. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... జయేష్‌కు 30 సంవత్సరాలు వచ్చినా ఏ సంబంధం కుదరదు. పెళ్లి కోసం జయేష్‌ పరితపిస్తుంటాడు. 

అంతేనా ఏకంగా మ్యారేజ్‌ ఏజెన్సీకి లైఫ్‌ టైమ్‌ మెంబరై వాళ్లని వేధిస్తుంటాడు. ఈ కోవలోనే శినిత అనే అమ్మాయి సంబంధం తెలుస్తుంది. శినిత తాను పామిస్ట్రీ చదివానని, జయేష్‌ చేయి చూస్తానని చెబుతుంది. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. జయేష్‌ చేయి చూసిన శినిత... జయేష్‌ జీవితంలో అనుకోని సంఘటనలు చాలా జరుగుతాయని, ఓ వ్యక్తి జయేష్‌ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అలాగే జయేష్‌కి వివాహం విచిత్రంగా అయ్యే అవకాశం కనబడుతోందని, అంతేకాదు... ఆ వివాహం వల్ల కొన్ని వర్గాల మధ్య కొట్లాటలు కూడా జరుగుతాయని చెబుతుంది.

అయితే జయేష్‌కు తనతో వివాహం చేసుకునే రాత కనిపించలేదని చెప్పి వెళ్లిపోతుంది శినిత. ఈ శినిత క్యారెక్టర్‌ ఆఖర్లో కడుపుబ్బా నవ్విస్తుంది. ఈలోపు జయేష్‌కు తన కుటుంబం నుండి అనుకోని సమస్యలు చాలానే వచ్చి పడతాయి. మరి... జయేష్‌కు పెళ్లవుతుందా? లేదా అన్నది మాత్రం ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ అవుతున్న ‘ఒరు జాతి జాతకమ్‌’  సినిమాలో చూడాలి. ఈ సినిమా మాత్రం ఆద్యంతం కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుంది. ఇది వేరే లెవెల్‌ కామెడీ అని చెప్పవచ్చు. దర్శకుడు తన కథానాయకుడు ఎలా నటించాలని అనుకున్నారో అంతకు వేయి రెట్లు వినీత్‌ వినూత్నంగా నటించారు. ఇట్స్‌ ఎ మస్ట్‌ వాచబుల్‌ కామెడీ ఫిల్మ్‌. – హరికృష్ణ ఇంటూరు 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)