Breaking News

కొత్త రూల్.. సంతకం పెడితేనే సినిమా షూటింగ్

Published on Sat, 06/21/2025 - 13:08

మలయాళ చిత్రసీమలో డ్రగ్ కల్చర్ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. షూటింగ్ లొకేషన్స్‌లోనే పలువురు నటులు మత్తు పదార్థాలు తీసుకోవడంతో పాటు తోటి నటీనటుల్ని ఇబ్బంది పెట్టడం లాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం ఓ మూవీ సెట్‌లో తోటి నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి విన్సీ సోనీ అలోషియస్‌ ఆరోపణ చేసింది. మరోవైపు డ్రగ్స్ ఆరోపణలతో షైన్‌ టామ్‌ చాకో సహా పలువురు నటుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

(ఇదీ చదవండి: ‘స్ట్రా' మూవీ రివ్యూ.. కూతురు కోసం ఒంటరి మహిళ పోరాటం)

దీంతో ప్రస్తుత పరిస్థితుల్ని మార్చేందుకు మాలీవుడ్ పెద్దలు ముందుకొచ్చారు. ఇకపై సినిమాలు చేయాలంటే షూటింగ్ టైంలో డ్రగ్స్ తీసుకోం అని రాసున్న అఫిడవిట్‌లో సంతకం చేయాలని తీర్మానించారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. నటీనటులు ఎవరైనా సరే ప్రాజెక్ట్ ఒప్పుకొనేటప్పుడు తప్పకుండా ఈ అఫిడవిట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. అప్పుడే సెట్‌లో అడుగుపెట్టనిస్తారు. సూపర్ స్టార్స్ నుంచి చిన్నస్థాయి టెక్నీషియన్స్ వరకు ఈ రూల్ వర్తిస్తుంది. అలానే నటీనటుల సిబ్బంది కూడా ఇది కచ్చితంగా పాటించాలి.

షూటింగ్‌ లొకేషన్స్‌తోపాటు నిర్మాణాంతర పనులు జరిగే ప్రదేశాల్లోనూ ఇది వర్తిస్తుందని కేరళ చిత్రసీమ చెప్పుకొచ్చింది. నిర్మాతల అసోసియేషన్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని డిపార్ట్‌మెంట్స్ నుంచి ఆమోదం వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం 'అమ్మ' (మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దీని గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈనెల 26 నుంచే ఈ రూల్ అమల్లోకి రానుంది. చూడాలి మరి ఎంతమంది పాటిస్తారో?

(ఇదీ చదవండి: నాన్న చెప్పిన ఒక్క మాటతో రూ.1,200 కోట్లు సంపాదన)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)