Breaking News

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత

Published on Wed, 05/17/2023 - 09:24

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నిర్మాత పీకేఆర్ పిళ్లై(92) కన్నుమూశారు. మాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన అనారోగ్యంతో సమస్యలతో త్రిసూర్ జిల్లా మందన్‌చిరలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మోహన్‌ లాల్‌తో ఎక్కువగా సినిమాలు నిర్మించారు.  

(ఇది చదవండి: నాకు పునర్జన్మ నిచ్చింది ఆమెనే: విజయ్ ఆంటోని)

 షిర్డిసాయి క్రియేషన్స్ బ్యానర్‌పై అమృతం గమ్య (1987), చిత్రం (1988), వందనం (1989), కిజక్కునరుమ్ పక్షి (1991, అహం (1992)తో సహా మోహన్‌లాల్ బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందించారు. పిళ్లై చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమా చిత్రమ్. దీనికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా.. మోహన్‌లాల్ నటించారు. ఈ సినిమా రెండు థియేటర్లలో 300 రోజులకు పైగా ఆడిన ఘనత సాధించింది. ఈ చిత్రం తరువాత తెలుగు, హిందీ, కన్నడ, తమిళంలో వరుసగా అల్లుడుగారు, ప్యార్ హువా చోరీ చోరీ, రాయరు బండారు మావన మానేగే, ఎంగిరుంధో వందన్‌గా రీమేక్ చేశారు. 

(ఇది చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్‌తేజ్‌ ఎంగేజ్‌మెంట్‌?)

పన్నెండు సంవత్సరాల క్రితం ముంబైలోని తన వ్యాపారాన్ని వదిలేసి కేరళాకు వచ్చారు పిళ్లై. 1984లో మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. సొంత చిత్ర నిర్మాణ సంస్థ షిర్డీ సాయి క్రియేషన్స్‌పై వేప్రాళం అనే చిత్రాన్ని నిర్మించాడు. మొదట ఎర్నాకులం లో ఉన్నప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు త్రిస్సూర్ లో స్థిరపడ్డారు. ఆయనకు భార్య రమ్య, పిల్లలు రాజేష్, ప్రీతి, సోను ఉన్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)