ఎల్‌2 ఎంపురాన్ మరో రికార్డ్.. 15 రోజుల్లోనే వంద కోట్ల మార్క్‌!

Published on Fri, 04/11/2025 - 17:22

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ఎల్‌2: ఎంపురాన్. ఈ మూవీకి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. 2019లో వచ్చిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా థియేటర్లలో విడుదలైన ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పాజిటివ్‌ టాక్ అందుకున్న ఈ మూవీ.. తొలిరోజే  ఏకంగా రూ.21 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్ల సాధించిన ఎంపురాన్.. మలయాళ ఇండస్ట్రీలోనే తొలి చిత్రంగా నిలిచింది.

తాజాగా ఎల్2: ఎంపురాన్ విడుదలైన 15 రోజుల్లోనే ఇండియన్‌ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్కును దాటింది. మార్చి 27న థియేటర్లలోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్‌ దేశీయ మార్కెట్‌లో రూ.102.9 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. రూ.120 కోట్లకు గ్రాస్‌తో అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.262.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే గురువారం రోజు మాత్రం కలెక్షన్స్‌ పరంగా చాలా అతి తక్కువగా నమోదైంది. కేవలం రూ. 70 లక్షలను మాత్రమే రాబట్టింది. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో పాటు  మంజు వారియర్, టోవినో థామస్, జెరోమ్ ఫ్లిన్, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటించారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)