Breaking News

OTT: జీవితం అర్థం చెప్పే ప్రేమకథ

Published on Sat, 12/28/2024 - 08:03

ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘కథా ఇన్నూవరే’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

ప్రేమ..ఈ భావం మనిషికి మనసుకి ఓ మధురానుభూతి. మనిషి పుట్టుక నుండి గిట్టే వరకు ఈ ప్రేమ ప్రతి దశలోనూ ఉంటుంది.  ఆ మహత్తరమైన ప్రేమను వెండితెరకు తీసుకురావడానికి తరతరాలుగా ఎంతో మంది దర్శకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే దర్శకుడు విష్ణుమోహన్ ఓ చక్కటి ప్రేమ పంధాను ఈ సినిమాకోసం ఎంచుకున్నారు. మళయాళ దర్శకుడైన విష్ణుమోహన్ సినిమాలన్నీ చాలా వరకు సున్నితమైన భావావేశాలతో రూపొందించబడ్డాయి. అటువంటి కోవలోనే ప్రస్తుతం ఈ సినిమా కథా ఇన్నూవరే కూడా తీశారు.  

ఓ నాలుగు ప్రేమ కథలు ఒకే కథగా కథా ఇన్నూవరే..(ఇప్పటి వరకు కథ) సినిమాలో చూపించడానికి ప్రయత్నించాడు దర్శకుడు విష్ణుమోహన్. 2018 సంవత్సరంలో ప్రముఖ హీరో రాణా నిర్మాతగా తెలుగులో ఓ సినిమా తీశారు. దాని పేరే C/o కంచరపాళెం. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ఆ సంవత్సరం న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అఫీషియల్ గా నామినేట్ అయింది. ఈ సినిమా రీమేకే ఇప్పటి కథా ఇన్నూవరే. 

ఇక కథ విషయానికొస్తే కొంచెం లేటు వయస్సులో ఉన్న రామచంద్ర తాను ఫ్యూను గా పనిచేస్తున్న ఆఫీసులో ఆఫీసరైన జానకి ప్రేమలో పడతాడు. జానకి కి 20 సంవత్సరాల కూతురు ఉంటుంది. ఇంకో పక్క కాలేజీలో చదువుకునే ఉమ కమ్యూనిస్ట్ ఉద్యమం కోసం పని చేసే జోసెఫ్ ని ఇష్టపడుతుంది. ఉమ తండ్రికి ఈ విషయం అస్సలు నచ్చదు. మరో పక్క నశీమా అనే వేశ్యను లిక్కర్ షాపులో పని చేసే రామచంద్రన్ ప్రేమిస్తుంటాడు. ఈ మూడు కథలతో పాటు బొమ్మలు తయారు చేసే ఓ శిల్పి కొడుకు స్కూల్ లో మరో అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. ఈ నాలుగు ప్రేమ కథలు ఒకదానికొకటి అస్సలు సంబంధముండదు. అయితే వాటిని లింక్ చేసేది మాత్రం ప్రేమే.

 అలాగే ఈ సినిమాలో ఆఖర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం సినిమాకే హైలైట్. మామూలుగా అయితే ప్రేమ కథలను చూసి అనుభూతి పొందుతాం. కాని ఈ సినిమాలో ప్రేమ మాత్రం జీవితానికి అర్ధం చెప్తుంది. ప్రైమ్ వీడియో  ఓటిటి వేదికగా కథా ఇన్నూవరే స్ట్రీమ్ అవుతోంది. వర్త్ ఫుల్ మూవీ ఫర్ ఎ ఫీల్ గుడ్ వ్యూవర్స్.
-ఇంటూరు హరికృష్ణ

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)