Breaking News

పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన జింఖానా మూవీ డైరెక్టర్‌..!

Published on Sun, 04/27/2025 - 11:10

ప్రముఖ డైరెక్టర్‌ ఖలీద్‌ రెహమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన అల్లప్పుజా జింఖానా మూవీ దర్శకుడైన ఖలీద్‌ నుంచి  గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆయనతో పాటు మరో డైరెక్టర్ అష్రఫ్ హంజా కూడా ఉన్నారు. కొచ్చిలోని ఓ ఫ్లాట్‌లో వీరిద్దరితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఆ ఫ్లాట్‌ మలయాళ సినిమాటోగ్రాఫర్‌ సమీర్‌ తాహిర్‌కు చెందినదని సమాచారం.  వీరి నుంచి 1.6 గ్రాముల హైబ్రిడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

డ్రగ్స్ కేసులో మలయాళ సినీ దర్శకులు అరెస్ట్ అలప్పుజ జింఖానా మూవీకి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా మలయాళంలో పలు సినిమాలను ఆయన తెరకెక్కించారు. మరో డైరెక్టర్‌ అష్రఫ్‌ తమాషా, భీమన్నంటే వాజి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా వీరిద్దరు గంజాయి కేసులో అరెస్ట్‌ కావడంతో మాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసు..

కొద్ది రోజుల క్రితమే మలయాళ నటుడు షైన్ టామ్ చాకోపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. అతనిపై మలయాళ ఇప్పటికే సినీ పెద్దలకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఓ హోటల్‌లో రైడ్ చేయడం పోలీసుల నుంచి టామ్ చాకో తప్పించుకున్నారు. ఏప్రిల్ 21న చాకోను అరెస్టు చేయగా.. వెంటనే స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా.. టామ్ చాకో తెలుగులో దసరా మూవీతో ఫేమస్ అయ్యారు. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీలోనూ కనిపించారు.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)