Breaking News

లైంగిక వేధింపుల కేసు.. మలయాళ డైరెక్టర్‌కు షాక్..!

Published on Thu, 04/02/2026 - 16:12

లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన మలయాళ డైరెక్టర్‌ రంజిత్ బాలకృష్ణన్‌కు కేరళ ఫిల్మ్ ఫెడరేషన్ షాకిచ్చింది. తక్షణమే ఆయనను ఫిల్మ్ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (FEFKA) నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి బి. ఉన్నికృష్ణన్ వెల్లడించారు. ఈ కేసులో అంతర్గత విచారణ పూర్తి చేసే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. తమ సభ్యులపై లైంగిక ఆరోపణలు వచ్చిన కేసులలో ఫెడరేషన్‌ ఒక ప్రామాణిక విధానాన్ని అనుసరిస్తుందని ఉన్నికృష్ణన్ పేర్కొన్నారు.

కాగా.. కొచ్చిలోని ఒక సినిమా షూటింగ్ ప్రదేశంలో తనపై క్యారవాన్ లోపల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఒక యువ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనవరి 30న షూటింగ్ సెట్‌లో తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆ నటి ఆరోపించింది.  దీంతో ఆయనను కొచ్చి పోలీసులు  అరెస్టు చేశారు. కొన్ని రోజుల క్రితం నటి ఫిర్యాదు చేయగా.. ఎర్నాకులం మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రంజిత్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. అతను ప్రస్తుతం ఎర్నాకులం సబ్ జైలులో ఉన్నాడు.
 

Videos

థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు

కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం

ఒకేసారి 30 వేల మంది అవుట్.. ఒరాకిల్ మాజీ ఉద్యోగి సంచలన విషయాలు

జగన్ మావిగన్.. టీడీపీ ఉక్కిరిబిక్కిరి

గులాబీ రంగులో చంద్రుడు.. ఏదో జరగబోతోంది!

జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, అనుచరులపై కేసు నమోదు

వీరులు పుట్టకముందే.. రాముడు ఉన్నాడు.. రామాయణం టీజర్ చూస్తే గూస్ బంప్స్ పక్కా

సాఫ్ట్ వేర్ సామ్రాజ్యం కుప్పకూలుతోందా?

చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్..

దళితుడిపై చేయి చేసుకున్న అయ్యన్నపాత్రుడు

Photos

+5

నేపాల్ ట్రిప్‌లో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ (ఫొటోలు)

+5

డైరెక్టర్ పోస్టు.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా హీరోయిన్ (ఫొటోలు)

+5

'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)