Breaking News

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్‌ కన్నుమూత

Published on Thu, 03/26/2026 - 15:13

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు ఈఏ రాజేంద్రన్ తీవ్ర అనారోగ్యంతో (71) కన్నుమూశారు. కేరళలోని కొల్లాం జిల్లా పట్టతానంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నాటకరంగంతో పాటు సినిమా, టీవీ రంగాల్లో సేవలందించారు.  ఆయన చేసిన సేవలకు గాను రాజేంద్రన్ మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు.

తన కళా జీవితాన్ని నాటకరంగంలో ప్రారంభించిన రాజేంద్రన్.. సినిమాల్లోకి రాకముందు రంగస్థల నటుడిగా మంచి పేరు సంపాదించారు. తన కెరీర్‌లో దాదాపు 60 చిత్రాలలో నటించారు. విలన్‌గా, సహాయ పాత్రలతో అభిమానులను మెప్పించారు. పలు సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు. కేరళ త్రిస్సూర్ జిల్లాలోని త్రితల్లూరులో గల ఎంగూర్ తారవాడులో  అయ్యప్పన్, సుమతి దంపతులకు రాజేంద్రన్ జన్మించారు. చిన్న వయసులోనే కళలపై ఆసక్తి కనబరిచారు. పూణేలోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో టెలివిజన్ కోర్సు అభ్యసించిన ఆయన.. ప్రముఖ నటుడు మాధవన్ కుమార్తె సంధ్యను వివాహం చేసుకున్నారు.

వీఆర్ గోపీనాథ్ దర్శకత్వం వహించిన గ్రీష్మం చిత్రంతో రాజేంద్రన్ తొలిసారిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ తర్వాత రాజేంద్రన్‌కు సినిమారంగంలో  అవకాశాలొచ్చాయి. జయరాజ్ దర్శకత్వం వహించిన కాళియాట్టం చిత్రంలోనూ నటించారు. అంతేకాకుండా ప్రణయ వర్ణంగల్, దయ, పట్టాభిషేకం వంటి మూవీస్‌లో కూడా కనిపించారు. అంతేకాకుండా రాష్ట్ర ఉద్యానవన సంస్థ అధ్యక్షుడిగానూ రాజేంద్రన్  సేవలందించారు.
 

Videos

కడప స్టీల్ పై బాబు నాటకం

సుప్రియ ఒంటిపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి... పేర్ని నాని ఫైర్

ఓటమిని ఒప్పుకోండి.. మాతో మీరు గెలవడం కల్లా..

బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం

అడ్డంగా నరికేస్తా.. యూజ్ లెస్ ఫెలో ఆదిరెడ్డికి ధమ్కీ ఇచ్చిన వ్యాపారి

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?

శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.

ఇన్వెస్టర్లకు జాక్పాట్ 1100% డివిడెండ్ ఇచ్చిన మైనింగ్ కంపెనీ

ఇన్వెస్టర్లకు పండగే లక్ష పెడితే 12 లక్షలు...ఒకటి కొంటే ఒకటి ఫ్రీ

YS జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

Photos

+5

రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)