Breaking News

ఓటీటీకి మరో మలయాళ మూవీ.. కేవలం వారికి మాత్రమే!

Published on Sun, 09/14/2025 - 18:36

ఓటీటీలు వచ్చాక మలయాళ చిత్రాలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ఇటీవల ఓటీటీల్లో మాత్రమే కాకుండా థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలుస్తున్నాయి. కంటెంట్‌ బాగుంటే చాలు ఆడియన్స్‌ తెగ చూసేస్తున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్‌ అన్నది ముఖ్యం కాదు.. స్టోరీ ముఖ్యమంటున్నారు. దీంతో ఓటీటీల్లో మలయాళ సినిమాలకు ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ వస్తోంది.

మలయాళంలో తెరకెక్కించిన మరో చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. అసిఫ్ అలీ, దివ్య ప్రభ జంటగా నటించిన సర్కీట్ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ఈనెల 26 నుంచి సింప్లీ సౌత్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‍అయితే కేవలం ఓవర్‌సీస్‌ ఆడియన్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండనుందని ప్రకటించారు.  'ముగ్గురు ఆత్మలు. ఒక రోజు. ఒక మలుపు' అంటూ పోస్టర్‌ను పంచుకున్నారు.

కాగా.. ఈ చిత్రం మే 8న థియేటర్లలో విడుదలైంది. రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీకి వస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయిన ఈ మూవీ.. ఓటీటీలోనైనా రాణిస్తుందేమో వేచి చూడాల్సిందే. ఈ మూవీని ఫుల్ కామెడీ అండ్‌ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)