ప్రపంచ యుద్ధ భయం.. కానీ స్టాక్ మార్కెట్లు ధ రికార్డులే కొడుతున్నాయి
Breaking News
మలయాళ బ్లాక్‌బస్టర్.. తెలుగులోనూ రిలీజ్
Published on Wed, 04/15/2026 - 19:43
మలయాళ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సవిన్ దర్శకత్వంలో వచ్చిన వాళా-2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ ఇప్పటికే ది గోట్ లైఫ్ ఆల్ టైమ్ వసూళ్లు అధిగమించింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో టాప్-6 ప్లేస్‌లో నిలిచింది. ఏప్రిల్ 2న రిలీజైన ఈ సినిమా రూ. 180 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి టాలీవుడ్ నిర్మాత సాహు గారపాటి కూడా నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు.
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నట్లు షైన్ స్క్రీన్స్ నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ ఏప్రిల్ 24న తెలుగులో విడుదల కానుందని వాళా-2 పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో హషీర్, అలన్, వినాయక్, అజిన్, బిజు కుట్టన్, అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు, అజు వర్గీస్, అమీన్, ఏంజెల్ కీలక పాత్రల్లో నటించారు.
వాళాకు సీక్వెల్..
2024లో వచ్చిన వాళా చిత్రానికి సీక్వెల్‌గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు విపిన్ దాస్ కథ అందించారు. మొదటి భాగానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని సవిన్ డైరెక్ట్ చేశాడు. సీక్వెల్‌కు రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారు. వాళా అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థమట. ఏ పని లేకుండా సోమరిగా తిరిగేవాళ్లను ఇదే పేరుతో పిలుస్తారట.
The laughter, the chaos, the brotherhood… now in Telugu.
After emerging as the biggest Malayalam blockbuster of 2026, #Vaazha2 is all set to arrive for the Telugu audience on April 24th ❤️🔥
Get ready to experience this sensational blockbuster on the big screens 🎬… pic.twitter.com/NpJ0R4gfMC— Shine Screens (@Shine_Screens) April 15, 2026
Tags : 1