Breaking News

అక్కడ స్టార్‌ హీరోయిన్‌.. తెలుగులో ఒకే ఒక్క సినిమా!

Published on Wed, 04/17/2024 - 18:21

ఎంత టాలెంట్‌ ఉన్నా సరే.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఇండస్ట్రీలో లక్‌ కలిసొస్తేనే అవకాశాలు, ఆర్భాటాలు.. లేదంటే ఇక్కడ పట్టించుకునే నాధుడే ఉండడు. అయితే గుర్తింపు తెచ్చుకోవడం ఒక సాహసమైతే.. ఆ క్రేజ్‌ను కాపాడుకోవడం కూడా అంతకుమించిన సాహసం. కొందరికి అన్నీ కలిసొచ్చి స్టార్స్‌గా వెలిగిపోతుంటారు. అది ఎంతకాలమన్నది వారి చేతుల్లోనే ఉంటుంది. పైన కనిపిస్తున్న నటి ఒకప్పుడు మలయాళంలో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణించింది. తెలుగులోనూ ఓ సినిమా చేసింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా?

అదే తొలి, చివరి సినిమా
తన పేరు సంవృత సునీల్‌. కేరళలో పుట్టిపెరిగిన ఈమె 2004లో రాసికన్‌ సినిమాతో మలయాళ చిత్రపరిశ్రమలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకుంది. ఉయిర్‌ మూవీతో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. తెలుగులో రాజశేఖర్‌ సరసన 'ఎవడైతే నాకేంటి' సినిమా చేసింది. టాలీవుడ్‌లో అదే ఆమె తొలి, చివరి సినిమా. మలయాళంలోనే ఎక్కువ మూవీస్‌ చేసిన ఆమె 2012లో అమెరికాకు చెందిన ఇంజనీర్‌ అఖిల్‌ జయరాజ్‌ను పెళ్లాడింది. వీరికి అగస్త్య, రుద్ర అని ఇద్దరు కుమారులు సంతానం.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరం
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంవృత 2019లో ఒకే ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది. 2008లో ఆమె నటించిన కాల్‌చిలంబు 2021లో రిలీజ్‌ అవడం విశేషం. వెండితెరపై కనిపించకుండా పోయిన ఈమె ఆమధ్య బుల్లితెరపై జడ్జిగా కనువిందు చేసింది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి అమెరికాలోనే ఉంటోంది. అక్కడే మలయాళీల కొత్త సంవత్సరం విషును సెలబ్రేట్‌ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

చదవండి: మరో అమ్మాయితో నా భర్త ప్రేమ వ్యవహారం.. ఆ ఏడాది మానసికంగా ఎంతో ఒత్తిడి!

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)