బైక్ ను 100 స్పీడ్ లో నడుపుతూ రీల్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే.. రికార్డైన వీడియోలో..!
Breaking News
ఆస్తి కోసం నా జీవితాన్ని నాశనం చేశారు..
Published on Wed, 04/15/2026 - 12:26
హైదరాబాద్: ఉమ్మడి ఆస్తి వ్యవహారంలో అక్కాచెళ్లెల్ల మధ్య తగాదా పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఈ వ్యవహారంలో ఒక సోదరి 1990 నాటి మళయాల నటి కావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. ప్రమీల, దేవి అలియాస్ సజని అక్కా చెల్లెల్లు. ప్రమీలకు నలుగురు ఆడపిల్లలు కాగా దేవికి పిల్లలు లేరు. ఈ క్రమంలోనే ప్రమీల, దేవి తల్లి తనకున్న ఆస్తిని చనిపోయే ముందు ఆరు వాటాలు చేసి ప్రమీలతోపాటు నలుగురు మనువరాళ్లకు, మరో కుమార్తె దేవికి అప్పగించారు.
ఈ క్రమంలోనే చాలా కాలంగా అక్కా చెల్లెల్ల మధ్య గొడవ జరుగుతుంది. గత నెలలోనూ తనపై తన సోదరి ఆమె కుటుంబసభ్యులు దాడికి పాల్పడ్డారంటూ దేవి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే మంగళవారం ఇద్దరి మధ్య గొడవ పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకొన్నారు. 100 ద్వారా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.
ఇందులో భాగంగా దేవి, వెంకటేశ్‌పై ఒక కేసు, ప్రమీల, శ్రీజ, విజయ్‌కుమార్, ఖజానా, శ్రీనిత్య, స్వర్ణ, గణేష్ పై కేసు నమోదు చేశారు. దేవి సినీనటిగానే కాకుండా పలు రాజకీయ పార్టీల్లో పనిచేసిన నేపథ్యం ఉంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Tags : 1