Breaking News

సీనియర్‌ నటుడిపై నటి రేవతి సంపత్‌ సంచలన ఆరోపణలు

Published on Sun, 08/25/2024 - 10:23

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్‌ హేమ కమిటీ ఒక నివేదికను రూపొందించింది. అందులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మాలీవుడ్‌ పరిశ్రమలో ఉండే మహిళలు కాస్టింగ్‌ కౌచ్‌ నుంచి వివక్ష వరకు  అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  హేమ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో మలయాళ నటి రేవ‌తి సంప‌త్ సంచలన ఆరోపణలు చేసింది.

మ‌ల‌యాళ సీనియ‌ర్ న‌టుడు సిద్ధిఖీ తనపై అత్యాచారం చేశాడంటూ సెన్సేషనల్‌ కామెంట్‌ నటి రేవతి సంపత్‌ చేసింది. ఆమె వ్యాఖ్యలతో మాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగుతుంది. అసోషియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్‌ (AMMA) నుంచి ఆయన తప్పుకున్నాడు. జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేసి తాజాగా ఆ లేఖ‌ను AMMA ప్రెసిడెంట్ మోహ‌న్ లాల్‌కు అంద‌జేశాడు.

నటి రేవతి సంపత్‌ 2021లోనే తనను చెప్పుకోలేని విధంగా హింసించారంటూ.. ఏకంగా 14 మంది పేర్లు బయటపెట్టి ఆమె సంచలనంగా మారింది. ఆ లిస్ట్‌లో  న‌టుడు సిద్ధిఖీ కూడా ఉన్నారు. సినిమాలపై ఆసక్తి ఉండటంతో నేను ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో సోషల్‌మీడియా ద్వార సిద్ధిఖీ పరిచయం అయ్యాడు. ఆయన నటిస్తున్న సినిమాల్లో అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని నాకు ఆశ చూపించాడు. సుమారు ఏడేళ్ల క్రితం వచ్చిన సుఖ‌మ‌యిరిక్క‌ట్టే చిత్రంలో ఆయన ప్రధాన పాత్రలో నటించారు. 

ఆ సమయంలో ప్రీమియ‌ర్ షోకు న‌న్ను కూడా ఆహ్వానించాడు. సినిమా పూర్తి అయిన తర్వాత తిరువ‌నంత‌పురంలోని మ‌స్క‌ట్ హోట‌ల్‌కు నన్ను తీసుకెళ్లి అక్కడ నాపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. నాపై అత్యాచారం చేశాడు. ఎదురుతిరిగినందుకు నాపై దాడిచేశాడు. హోటల్‌ గదిలో బిక్కుబిక్కుమంటూ నరకం చూశాను. ఆ భయానక సంఘటన నుంచి నేను ఇప్పటికీ కోలుకోలేకున్నాను.' అని రేవతి సంపత్‌ చెప్పింది. సిద్ధిఖీ చాలా నీచమైన వ్యక్తి అంటూ తన స్నేహితులపై కూడా ఆయన లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది.

మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతోన్న వేధింపుల‌పై జ‌స్టిస్ హేమ క‌మిటీ 2019లోనే ప్ర‌భుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అయితే, అది ఇన్నేళ్ల తర్వాత బయటకు రావడంతో అక్కడి పరిశ్రమలో పెద్ద దుమారం రేగుతుంది. ఈ రిపోర్ట్‌ వచ్చిన తర్వాత మ‌ల‌యాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అందులో జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఉన్న సిద్ధిఖీ అందరికీ న్యాయం చేస్తానని కామెంట్‌ చేసిన కొన్ని గంటల్లోనే రేవతి సంపత్‌ అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేశాడు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)