Breaking News

బ్రెయిన్‌ స్ట్రోక్‌.. మూతి వంకర.. అవే చివరి క్షణాలనుకున్నా!

Published on Sun, 01/18/2026 - 15:56

రెండేళ్ల క్రితం చావును దగ్గరి నుంచి చూశానంటోంది మలయాళ నటి, దర్శకురాలు, యాంకర్‌ రంజిని మీనన్‌. లైఫ్‌ సజావుగా సాగుతున్న సమయంలో స్ట్రోక్‌ వచ్చిందంటూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. 2024 నవంబర్‌ 18.. ఎర్నాకుళంలోని టీడీఎమ్‌ హాల్‌లో నేను మాట్లాడాల్సి ఉంది. అయితే స్పీచ్‌ ఇవ్వడానికి వెళ్లేముందు నా భర్త రాజగోపాల్‌తో కలిసి కాఫీ తాగాలనుకున్నాను. 

మూతి వంకర
కానీ కాఫీ తాగుతుంటే కిందపడుతోంది. నా మాటలు కూడా వంకరపోతున్నాయి. అది చూసి నా కొడుకు ఆటపట్టిస్తుంటే లైట్‌ తీసుకున్నాను. నా భర్త నన్ను గమనించి హాస్పిటల్‌కు వెళ్దామన్నాడు. లేదు, ఈవెంట్‌కు అర్జంట్‌గా వెళ్లాలని చెప్పాను. ఫోన్‌లో టైప్‌ చేయడానికి కూడా నా శరీరం సహకరించలేదు. తీరా హాల్‌కు వెళ్లేసరికి నా పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. 

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో పాటు గుండెపోటు
నా మాట పూర్తిగా మారిపోయింది. అది గమనించి చక్కెర కలిపిన నీళ్లు ఇచ్చారు. అది తాగగానే హఠాత్తుగా కింద పడిపోయాను. ఆస్పత్రికి తీసుకెళ్లగా నాకు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో పాటు గుండెపోటు వచ్చిందన్నారు. నా మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టింది. దానివల్ల కుడివైపు శరీరం బలహీనంగా మారిపోయింది. కొన్ని జ్ఞాపకాలు చెదిరిపోయాయి. ఇక అవే నా చివరి క్షణాలనుకున్నాను. ఐసీయూలో కొన్నిరోజులపాటు ఉంచారు. ఐసీయూలో ఒక్కరోజు ఉన్నా సరే అది మనకు జీవితమంటే ఏంటో నేర్పిస్తుంది.

మళ్లీ నడక నేర్చుకున్నా..
నాకు జ్ఞాపకశక్తి ఉందా? కోల్పోయానా? అని తెలుసుకునేందుకు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం చదివేవాన్ని. నాలుగురోజులకు నన్ను డిశ్చార్జ్‌ చేశారు. ఐదో రోజు వీల్‌చైర్‌లోనే టీడీఎమ్‌ హాల్‌కు వెళ్లాను. తర్వాత ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాను. అక్కడే మళ్లీ నడక నేర్చుకున్నాను. మామూలు మనిషినయ్యాను. మన గురించి మనం పట్టించుకోకుండా పరుగులు పెట్టడం ఎంత తప్పో అప్పుడు నాకర్థమైంది అని రంజిని చెప్పుకొచ్చింది.

చదవండి: నన్ను తిడుతూ సినిమా మధ్యలో వెళ్లిపోతారు: గుణశేఖర్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)