Breaking News

వృద్ధ తల్లిపై నటి దాడి! ఏ నుయ్యో గొయ్యో చూసుకునేవాళ్లం..

Published on Mon, 09/01/2025 - 15:57

తల్లి కోసం భర్తను, పిల్లల్ని వదిలేసింది మలయాళ నటి లవ్లీ బాబు (Lovely Babu). మంచానపడ్డ తల్లిని తీసుకుని కేరళ కొల్లంలోని గాంధీ భవన్‌ ఆశ్రమంలో జీవిస్తోంది. కేవలం ఆమెను చూసుకోవడానికే సినిమాలకు సైతం విరామం ఇచ్చినట్లు చెప్పింది. అయితే ఆమె తన తల్లి చేతులు కట్టేసి ఆమెపై దాడి చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

డబ్బుకే విలువ
దీంతో కొందరు నటిని తప్పుపడుతుండగా మరికొందరు ఆమెను వెనకేసుకొస్తున్నారు. సేవలు చేసినప్పుడు కొన్నిసార్లు అసహనం, కోపం రావడం సహజం.. అందులో లవ్లీ తప్పేమీ లేదని కామెంట్లు చేస్తున్నారు. తాజాగా లవ్లీ మాట్లాడుతూ.. గతంలో నాకు క్యాన్సర్‌ ఉండేది. అప్పుడు క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ ఖర్చు, నా పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు.. ఇలా నాపై చాలా భారం ఉండేది. నా భర్త ఎప్పుడూ డబ్బు ముఖ్యం అని నమ్మేవాడు. తను బంధాలకు విలువ ఇవ్వడు.

దీనస్థితిలో అమ్మ
ఒకసారి నేను ఊరెళ్లి పది రోజుల తర్వాత వచ్చాను. అప్పుడు అమ్మ పరిస్థితి చూసి షాకయ్యాను. వాంతులు చేసుకున్న ప్లేస్‌లోనే పది రోజులుగా పడుకుని ఉంది. మరోసారేమో తన డైపర్‌ ఎవరూ మార్చకపోవడంతో గదంతా కంపు కొడుతోంది. అమ్మ పరిస్థితి అధ్వాణ్నంగా తయారైనప్పుడు నాకు కోపం వచ్చేది. నాకు చచ్చిపోవాలనిపించేది. కానీ నేను పోతే అమ్మను ఎవరు చూసుకుంటారనిపించేది. పట్టలేనంత కోపం వచ్చినప్పుడు అమ్మను కొట్టేదాన్ని. అది కావాలని చేసింది కాదు.. తర్వాత మళ్లీ నేనే బాధపడేదాన్ని.

ఏ రైలు కిందో పడేవాళ్లం
అమ్మను వదిలించుకోమని ఇంట్లోవాళ్లన్నారు. కానీ తనను అనాథగా వదిలేందుకు మనసొప్పలేదు. బయటకు వెళ్లి బతికేంత ఆర్థిక స్థోమత లేదు. అందుకే భర్తను, పిల్లల్న వదిలి ఆశ్రమానికి వచ్చేశాను. గాంధీ భవన్‌ మాకు ఆశ్రయం కల్పించుండకపోతే మేము ఏ రైలు కిందో పడేవాళ్లం, లేదంటే ఏ చెరువులోనో దూకి చనిపోయేవాళ్లం అని లవ్లీ బాబు భావోద్వేగానికి లోనైంది.

 

 

చదవండి: పోలీస్‌ స్టేషన్‌లో దెయ్యాలు.. ఆర్జీవీ కొత్త సినిమా పోస్టర్‌

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)