Breaking News

సీనియర్ నటి కన్నుమూత.. ముఖ్యమంత్రి సంతాపం

Published on Sat, 09/21/2024 - 07:59

మలయాళ ప్రముఖ నటి కవియూర్ పొన్నమ్మ (79) తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఈమె.. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. దాదాపు ఆరు దశాబ్దాల నుంచి మలయాళ చిత్రాల్లో ఈమె పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఇలా ఈమె మృతి చెందడంపై స్టార్ హీరోహీరోయిన్లతో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా)

'తల్లి పాత్రలతో మలయాళ ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న కవియూర్ పొన్నమ్మ మృతి పట్ల ప్రగాఢ సంతాపం. ఆమె జీవితం సినిమాకే పరిమితం కాదు. థియేటర్, టెలివిజన్ రంగాలకు కూడా విస్తరించింది' అని ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

ఇకపోతే పొన్నమ్మ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. కలమస్సేరి మున్సిపల్ టౌన్ హాల్‌లో ప్రజల సందర్శనార్ధం ఆమె పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. గాయనిగా పొన్నమ్మ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత నాటకరంగంలోకి ప్రవేశించి, అనంతరం నటిగా మారారు. అలా దాదాపు 1000 సినిమాల్లో నటించారు. ఈమె చేసిన తల్లి పాత్రలతో అందరికీ దగ్గరైపోయారు. అలానే విలన్ తరహా పాత్రల్లోనూ నటించి ఆకట్టుకున్నారు.ప్రతికూల పాత్రలతో సహా విభిన్న పాత్రలను పోషించింది.  మేఘతీర్థం చిత్రాన్ని కూడా నిర్మించారు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)