Breaking News

నటి రెండో పెళ్లి.. తోడుగా నిలబడ్డ 12 ఏళ్ల కూతురు

Published on Thu, 08/21/2025 - 17:29

ప్రముఖ మలయాళ యాంకర్‌, నటి ఆర్య (Arya Babu) రెండో పెళ్లి చేసుకుంది. నటుడు, కొరియోగ్రాఫర్‌ సిబిన్‌ బెంజమిన్‌తో మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. అతడికి కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం! ఈ ఏడాది మేలో వీరి నిశ్చితార్థం జరగ్గా.. తాజాగా ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగింది. 

12 ఏళ్ల కూతురితో మండపానికి..
తన జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోను ఆర్య సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో ఆర్య 12 ఏళ్ల కూతురు రోయా అలియాస్‌ ఖుషి.. తల్లిని మండపం వరకు తీసుకొచ్చింది. తల్లి మెడలో మూడు ముళ్లు పడుతుంటే సంతోషంతో చిరునవ్వులు చిందించింది. ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతుండగా అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఫ్రెండ్స్‌ భార్యాభర్తలుగా..
కుంజిరమయనం, పవ, ఉల్టా, మెప్పడియాన్‌, క్వీన్‌ ఎలిజబెత్‌ వంటి పలు మలయాళ చిత్రాల్లో ఆర్య నటించింది. అక్కడి బుల్లితెరపై టాప్‌ యాంకర్‌గా రాణిస్తోంది. మలయాళ బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లోనూ పాల్గొంది. నటి అర్చన సోదరుడు, ఐటీ ఇంజనీర్‌ రోహిత్‌ సుశీలన్‌ను పెళ్లాడింది. వీరికి రోయ అనే కూతురు పుట్టింది. 2019లో భర్త నుంచి విడిపోయినట్లు ఆర్య ప్రకటించింది. డీజే సిబిన్‌.. మలయాళ బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇతడిక్కూడా గతంలో పెళ్లయి పిల్లలున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా స్నేహితులుగా ఉన్న వీరు ప్రేమలో పడటంతో ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు.

 

 

చదవండి: సైలెంట్‌గా కార్తీకదీపం సీరియల్‌ నటి కూతురి పెళ్లి

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)