Breaking News

చంపేస్తానని బెదిరిస్తున్నాడు.. యువ హీరోయిన్‌ ఫిర్యాదు

Published on Wed, 07/05/2023 - 13:59

టాలీవుడ్‌లో 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్‌ అర్థనా బిను. 2016లో వచ్చిన ఈ సినిమాలో రాజ్ తరుణ్‌కు జోడీగా నటించింది. చూడటానికి అచ్చ తెలుగమ్మాయిలా ఉంటుంది ఈ మలయాళీ బ్యూటీ. ఆ సినిమా తర్వాత ఇంతవరకు తను ఏ తెలుగు మూవీలో నటించలేదు. కానీ తమిళ్‌,మలయాళ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది.

(ఇదీ చదవండి: అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక)

తాజాగా హీరోయిన్‌ 'అర్థనా బిను' తన తండ్రి విజయకుమార్‌పై షాకింగ్ ఆరోపణలు చేసింది. తన తల్లి విడాకులు తీసుకోవడంతో తండ్రికి దూరంగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రి, నటుడు విజయకుమార్ అక్రమంగా ఇంట్లోకి చొరబడిన వీడియోను షేర్‌ చేసింది. తన తల్లి నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ అతను అప్పుడప్పుడు ఇంటికి వచ్చి గందరగోళం చేస్తుంటాడని ఆరోపించింది. తన కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె తెలిపింది.

 'ఈ రోజు, అతను మా ఇంటి కాంపౌండ్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. అప్పటికే మేము ఇంటిలోపల నుంచి తలుపు లాక్ చేయడంతో కిటికీ ద్వారా బెదిరింపులకు దిగాడు. నా చెల్లెలుతో పాటు అందరినీ చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చాడు. అంతేకాకుండా సినిమాల్లో నటించడం ఆపేయ్‌ లేదా తను చెప్పిన సినిమాల్లో మాత్రమే నటించాలని షరతులు పెడుతున్నాడు. నాతో ఉండే నటల గురించి కూడా తప్పుగా మాట్లాడుతున్నాడు. చివరకు మా అమ్మ పనిచేసే ప్రదేశంతో పాటు సోదరి చదువుకునే విద్యా సంస్థ వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించినందుకు  అతనిపై కోర్టులో కేసు నడుస్తుండగా ఇప్పుడు ఇంటికి వచ్చి వార్నింగ్‌ ఇస్తున్నాడు.' అని తెలిపింది.

(ఇదీ చదవండి: స్పై సినిమా ఎఫెక్ట్‌.. అభిమానులను క్షమాపణ కోరిన హీరో నిఖిల్)

తనను సినిమాలు చేయకుండా, నటించకుండా ఆపాలని తండ్రి విజయకుమార్ తనపై కూడా కేసు పెట్టాడని అర్థనా పేర్కొంది. 'నేను నా ఇష్టానికి మాత్రమే సినిమాల్లో నటిస్తున్నాను. మూవీలో నటించడం నా అభిరుచి, నాకు ఆరోగ్యం సహకరించినంత కాలం నటిస్తూనే ఉంటాను. సినిమాల్లో నటించకుండా ఆపాలని నాపై కేసు పెట్టాడు. నేను షైలాక్‌లో నటించినప్పుడు కూడా, అతను లీగల్‌గా కేసు పెట్టాడు. ఆ సినిమా ఆగిపోకుండా ఉండేందుకు నేను నా సొంత ఇష్టానుసారం సినిమాలో నటించానని అధికారిక చట్టపరమైన పత్రాలపై సంతకం చేయాల్సి వచ్చింది. అని వాపోయింది.


Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)