Breaking News

మోదీ జీవితంతో మా వందే 

Published on Thu, 09/18/2025 - 04:36

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌ వెండితెరకు రానుంది. ‘మా వందే’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాలో మోదీ పాత్రలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ నటించనున్నారు. క్రాంతికుమార్‌ సీహెచ్‌. రచన, దర్శకత్వంలో వీర్‌ రెడ్డి .ఎం నిర్మించనున్నారు. బుధవారం (సెప్టెంబరు 17) మోదీ పుట్టినరోజు సందర్భంగా ‘మా వందే’ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. వీర్‌ రెడ్డి .ఎం మాట్లాడుతూ– ‘‘మోదీగారి వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని ఘటనలు, విశేషాలను ఎంతో సహజంగా మా సినిమాలో చూపించబోతున్నాం. 

సమాజం కోసం ఎన్నో ఆకాంక్షలు గల బాలుడి నుంచి దేశ ప్రధానిగా మోదీ ఎదిగిన క్రమాన్ని చూపిస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలు, సాంకేతిక విలువలు, వీఎఫ్‌ఎక్స్‌తో ‘మా వందే’ని పాన్‌ ఇండియా భాషలతో పాటు ఇంగ్లిష్‌లోనూ నిర్మిస్తాం. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పదనే సందేశం ఈ కథలో కీలకం. మోదీ ప్రపంచనాయకుడిగా ఎదగడం వెనక ఆయన మాతృమూర్తి హీరాబెన్‌ ప్రేరణ ఎంతో ఉంది’’ అని చె΄్పారు. ఈ చిత్రానికి కెమెరా: కేకే సెంథిల్‌ కుమార్, సంగీతం: రవి బస్రూర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: గంగాధర్‌ .ఎన్‌ ఎస్, వాణిశ్రీ .బి, లైన్‌ ప్రొడ్యూసర్‌: టీవీఎన్‌ రాజేశ్‌.  

Videos

ఎందుకు మీకు అంత భయం.. విడుదల రజినిని ఆపేసిన పోలీసులు

రూ.6 వేల కోట్లు ఇవ్వడానికి చేతులు పడిపోయినాయా బాబూ..

నాగ్ 100 కోసం భారీ స్కెచ్.. కానీ

Jr Ntr: 7 వారాల్లో... 10 కిలోల బరువు తగ్గిన టైగర్

కుమ్మేస్తున్న రామ్ చరణ్! మెగా ఫ్యాన్స్ కు పూనకాలే

పోలీసుల ఓవరాక్షన్.. YSRCP నేతల ఉగ్రరూపం.. మచిలీపట్నంలో హైటెన్షన్!

తన బినామీలకు దోచిపెట్టడానికే బాబు కుట్రలు

చలో మెడికల్ కాలేజీ నిరసనలో... దద్దరిల్లిన మచిలీపట్నం

ఎవరి సొమ్ము.. ఎవరి సొత్తు.. బాబును రఫ్ఫాడించిన పేర్ని కిట్టు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై YARCP ఎమ్మెల్సీ ల నిరసన

Photos

+5

కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ.. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై ఉవ్వెత్తున ఉద్య‌మం (చిత్రాలు)

+5

విజయవాడ : కనులపండువగా దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఉదయం ఉక్కపోత..సాయంత్రం కుండపోత వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్ రోడ్డుపై అడవి జంతువులు..అవునా.. నిజమా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ట్రాఫిక్‌ సమ్మిట్‌–2025..ముఖ్య అతిథిగా సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)