ప్రేమమ్ నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. పోలీసులు ఏం తేల్చారంటే?

Published on Wed, 11/06/2024 - 18:36

ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌలీపై గతంలోనే లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. సినిమాల్లో అవకాశం పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ యువ నటి ఫిర్యాదు చేసింది.  దుబాయ్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురిపై యువతి ఆరోపణలు చేసింది. దీంతో అప్పట్లోనే నివిన్ పౌలీతో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. జస్టిస్ ‍హేమ కమిటీ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు నటులపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.

అయితే ఆ తర్వాత జరిగిన విచారణలో నటుడు నివిన్ పౌలీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. తాజాగా ఈ కేసులో నివిన్ పౌలీకి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. యువతి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సంఘటన జరిగిన సమయంలో నివిన్ పౌలీ అక్కడ లేరని గుర్తించినట్లు తెలిపారు. అతను లైంగికంగా వేధించినట్లు స్పష్టమైన ఆధారాలు తమకు లభించలేదని కొత్తమంగళం కోర్టుకు  సమర్పించిన నివేదికలో వెల్లడించారు. దీంతో ఆరో నిందితుడిగా ఉన్న ఆయన పేరును తొలగించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే మిగిలిన నిందితుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా.. నివిన్ పౌలీ మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ప్రేమమ్ చిత్రంలో నటించారు. 
 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)