Breaking News

మొన్న బెయిల్‌పై వచ్చిన నటుడు.. ఇంతలోనే మూడో పెళ్లితో వైరల్‌

Published on Wed, 10/23/2024 - 13:45

మలయాళ నటుడు బాల (బాలకుమార్) మూడో పెళ్లి చేసుకున్నాడు. పదిరోజుల క్రితం తన మాజీ భార్య  అమృత సురేశ్ ఫిర్యాదు చేయడంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనతో పాటు కూతురు అవంతికను వేదించాడని ఆమె ఫిర్యాదు చేయడంతో ఆయన్ను అరెస్ట్‌ చేశారు. అయితే, ఈ కేసులో అరెస్ట్‌ అయిన 24గంటల్లో ఆయనకు బెయిల్‌ లభించింది. ఈ క్రమంలో తాజాగా మూడో పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చాడు.

'బాల' మలయాళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. 'కంగువ' సినిమా దర్శకుడు శివకు  స్వయాన తమ్ముడు అవుతాడు. కొద్దిరోజుల క్రితమే బెయిల్‌ మీద బయటకొచ్చిన బాల.. మూడో పెళ్లి చేసుకుని తన భార్యతో కేరళలోని కలూర్‌ పావకులం ఆలయానికి వచ్చాడు. తమిళనాడుకు చెందిన తన బంధువు కోకిలను ఆయన వివాహం చేసుకున్నాడు. అయితే, ఇరుకుటుంబాల మధ్య మాత్రమే ఈ కార్యక్రమం జరిగింది. పెళ్లి గురించి బాల ఇలా చెప్పుకొచ్చాడు. కోకిల తన మామయ్య కూతురని వెళ్లడించాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెకు చిరకాల కోరిక ఉండేదని అన్నాడు. ఇలా ఆమె కోరిక నెరవేరిందని బాల చెప్పాడు.  'కష్ట సమయంలో కోకిల మాత్రమే నాకు మద్దతుగా నిలిచింది. నేను మళ్లీ పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావడానికి ఆమె కారణం.' అని చెప్పాడు.

బాల గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అతని మొదటి వివాహం 2010లో గాయని అమృత సురేష్‌తో జరిగింది. ఈ జంటకు అవంతిక అనే కుమార్తె ఉంది. వారు 2019లో విడాకులు తీసుకున్నారు.  వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఎలిజబెత్ ఉదయన్‌ను 2021లో రెండోసారి వివాహం చేసుకున్నాడు. 2023లో వారిద్దరూ విడివిడిగా జీవించడం ప్రారంభించారు. విడాకులు ఇచ్చి కూడా తనను వేదిస్తున్నాడని కేసు పెట్టిన మొదటి భార్య కోర్టులో న్యాయపోరాటం చేస్తుంది. కూతురు అవంతికతో పాటు తనను కూడా సోషల్‌మీడియాలో దారుణంగా తిడుతున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ కేసు విచారణలో ఉంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)