Breaking News

ఆయన అడిగిన ప్రశ్న ఎంతో బాధించింది: నటి అంజలి అమీర్‌

Published on Tue, 08/27/2024 - 08:56

మలయాళ చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌ మారిన హేమ కమిటీ రిపోర్ట్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మాలివుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న కాస్టింగ్‌ కౌచ్‌ నుంచి పలు సమస్యలపై జస్టిస్‌ హేమ కమిటీ ఓ నివేదిక రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు హీరోయిన్లు, ఇతర నటులు గతంలో తమ చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. తాజాగా మలయాళ తొలి ట్రాన్స్‌జెండర్ నటి అంజలి అమీర్ తన అనుభవాలను పంచుకున్నారు.

మ‌ల‌యాళ న‌టుడు నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అంజలి అమీర్‌ ఇలా పంచుకున్నారు. ' 2018లో మమ్ముట్టి నటించిన పెరున్బు అనే తమిళ సినిమాలో నేను కీలక పాత్ర పోషించాను. ఆ సినిమాలో  సూరజ్ వెంజరమూడ్ కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆయన నుంచి నాకు ఒక ప్రశ్న ఎదురైంది. లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులు స్త్రీలలాగా ఎలా సుఖం పొందుతారని సూరజ్ వెంజరమూడ్ నన్ను ప్రశ్నంచారు. అప్పుడు నేను చాలా కలత చెందాను. 

ఆయన అడిగేంత వరకు, నేను అలాంటి బాధాకరమైన అనుభవాలను ఎప్పుడూ ఎదుర్కోలేదు. నేను బలంగా ఉన్నాను, కానీ ఈ ప్రశ్న నాకు చాలా కోపం తెప్పించింది. అతడిని హెచ్చరించి మమ్ముట్టికి, దర్శకుడికి తెలియజేశాను. ఆపై వెంటనే సూరజ్ వెంజరమూడ్ క్షమాపణలు చెప్పాడు. మరలా నాతో అలా మాట్లాడలేదు. నేను ఆయన్ను అభినందిస్తున్నాను.' అని అంజలి అమీర్ అన్నారు. సూరజ్ వెంజరమూడ్ టాలీవుడ్‌కు పరిచయమే.. డ్రైవింగ్ లైసెన్స్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, జనగణమన చిత్రాల‌తో పాటు నాగేంద్రన్స్ హానీమూన్స్‌ వెబ్‌ సిరీస్‌తో ఆయన తెలుగు వారికి దగ్గరయ్యాడు.

ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఇతరుల పట్ల గౌరవంగా ఉంటారని అంజలి పేర్కొంది. అన్ని విభాగాల్లో మాదిరి ఇక్కడ కూడా మంచివాళ్లతో పాటు చెడువాళ్లు కూడా ఉన్నారు. ఇక్కడ కొందరు మాత్రమే కాంప్రమైజ్‌లు, ఫేవర్‌లు అడిగేవాళ్లు ఉన్నారని అంజలి పేర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)