Breaking News

రాత్రి ట్రైన్‌లో ప్రయాణం.. ఏకంగా ముద్దిస్తావా? అని అడిగాడు: మాళవిక మోహనన్

Published on Sun, 04/20/2025 - 15:02

కోలీవుడ్ భామ మాళివిక మోహనన్ గతేడాది తంగలాన్‌ మూవీతో అభిమానులను అలరించింది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ సరసన మెప్పించింది. మలయాళం, తమిళ చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. ప్రభాస్ సరసన ది రాజాసాబ్‌ చిత్రంలో కనిపించనుంది. మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. తనకెదురైన  ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. ముంబయిలో తాను ఓ భయానక అనుభవం ఎదురైందని పేర్కొంది. లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. ముంబయి లాంటి నగరంలో మహిళల భద్రత గురించి నటి మాళవిక మోహనన్ స్పందించింది.

మాళవిక మోహనన్‌ మాట్లాడుతూ..'ముంబయిలో ఒక రోజు రాత్రి నా స్నేహితులతో కలిసి లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించా. రాత్రి 9 గంటల 30 నిమిషాలు అయింది. ఫస్ట్ క్లాస్‌ కంపార్ట్‌మెంట్ చాలా ఖాళీగా ఉంది. ఆ కంపార్ట్‌మెంట్‌లో మేము తప్ప ఎవరూ లేరు. అదే సమయంలో ఒక వ్యక్తి అందులోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. కంపార్ట్‌మెంట్‌ వద్ద ఉన్న గ్లాస్‌ డోర్‌ నుంచి తమవైపే చూస్తూ ముద్దిస్తావా అని సైగలు చేశాడు. అప్పుడు అతడి ప్రవర్తనతో మేమంతా భయానికి గురయ్యాం. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. దాదాపు 10 నిమిషాల తర్వాత వేరే స్టేషన్‌ రాగానే కొంతమంది ప్రయాణికులు మాకు తోడయ్యారు. అప్పుడే మేమంతా ఊపిరి పీల్చుకున్నాం' అని వెల్లడించింది. అయితే అక్కడ ఉన్న మహిళలకు సురక్షితమా కాదా అనే విషయం అదృష్టంపై కూడా ఆధారపడి ఉంటుందని తెలిపింది.

మాళవిక మాట్లాడుతూ..'నగరం మహిళలకు ఎంత సురక్షితమైనది అనే అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. ముంబయి మహిళలకు సురక్షితం అని ప్రజలు చెబుతారు. కాని నేను ఆ అభిప్రాయాన్ని సరిదిద్దాలనుకుంటున్నా.  ఈ రోజు నాకు సొంత కారు,  డ్రైవర్ ఉన్నాడు. కాబట్టి ఎవరైనా నన్ను ముంబై సురక్షితంగా ఉందా అని అడిగితే.. నేను అవును అని చెప్పగలను. కానీ నేను కాలేజీలో ఉన్నప్పుడు, బస్సులు మరియు రైళ్లలో ప్రయాణించడం, నేను తరచుగా ప్రయాణించడం అదృష్టంగా భావించలేదు. ఆ సమయంలో చాలా ప్రమాదకరంగా అనిపించేది' అని చెప్పుకొచ్చింది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)