Breaking News

కెమెరా వెనక వాళ్ల అసలు బుద్ధి ఏంటో చూపిస్తారు: హీరోయిన్‌

Published on Sat, 05/03/2025 - 07:40

నిర్మొహమాటంగా, నిర్భయంగా మాట్లాడే అతి తక్కువ మంది నటీమణుల్లో మాళవికా మోహన్‌( Malavika Mohanan) ఒకరని చెప్పవచ్చు. మనిషే కాదు ఈమె నటనా చాలా బోల్డ్‌గా ఉంటుంది. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన పేట చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళీ భామ ఈమె. ఈ తరువాత విజయ్‌కు జతగా మాస్టర్, ధనుష్‌కు జంటగా మారన్‌ తదితర చిత్రాల్లో నాయకిగా నటించి గుర్తింపు పొందారు. ఇటీవల విక్రమ్‌ హీరోగా పా.రంజిత్‌ తెరకెక్కించిన తంగలాన్‌ చిత్రంలో ప్రతినాయకి ఛాయలున్న విభిన్న పాత్రలో నటించి, ప్రశంసలు అందుకున్నారు. 

అదే విధంగా మలయాళం, హిందీ భాషల్లో నటిస్తున మాళవికా మోహన్‌ తాజాగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ' రాజాసాబ్‌' చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా కార్తీతో కలిసి సర్దార్‌–2 చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఒక సమావేశంలో మాళవికా మోహన్‌ నటులపై ఆమె విరుచుకుపడ్డారు. ఆమె మాట్లాడుతూ సినిమాలో కొందరు నటులు మహిళలను గౌరవిస్తున్న ముసుగులో మంచి పేరు పొందుతున్నారన్నారు. 

తాను గత ఐదేళ్లుగా అలాంటి ముసుగు నటులను చాలా మందిని చూశానని ఆమె  పేర్కొన్నారు. ఎలాంటి సమయాల్లో మహిళలపై మంచిగా మాట్లాడాలన్నది వారికి బాగా తెలుసన్నారు. అయితే కెమెరా వెనక వారు ఎలా మారుతున్నారన్నది తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. సినిమా రంగంలో ఆడ, మగ అన్న తారతమ్యం ఇంకా వేళ్లూనుకునే ఉందని, దీనికి అంతం ఎప్పుడన్నది తనకు తెలియడం లేదని నటి మాళవికా మోహన్‌ పేర్కొన్నారు. ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)