ప్రేమపై నాకు నమ్మకం ఉంది!

Published on Mon, 01/12/2026 - 03:03

మలైకా అరోరా.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రత్యేకపాటల్లో తనదైన హుషారైన స్టెప్పులతో ప్రేక్షకులను అలరించారామె. మహేశ్‌బాబు ‘అతిథి’ చిత్రంలో ‘రాత్రైనా నాకు ఓకే..’, పవన్‌ కల్యాణ్‌ ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాలో ‘కెవ్వు కేక...’పాటలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు మలైకా అరోరా. నటుడు సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్తో 1998లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు మలైకా. వ్యక్తిగత కారణాల వల్ల 2017లో విడాకులు తీసుకున్నారు. అర్జున్ కపూర్‌తో ప్రేమలో ఉండటం వల్లే అర్బాజ్‌ ఖాన్‌కి మలైకా విడాకులిచ్చారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత అర్జున్ కపూర్‌– మలైకా అరోరా కూడా రిలేషన్ షిప్‌కి బ్రేకప్‌ చెప్పారు. తాజాగా తన విడాకులు, రిలేషన్‌ షిప్‌ గురించి మాట్లాడారు మలైకా అరోరా. ‘‘నేను వివాహ బంధంలోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత విడిపోయాను. అనంతరం రిలేషన్షిప్‌లో ఉన్నాను. బ్రేకప్‌ అయ్యింది. అంత మాత్రాన ప్రేమ అనేది తప్పు అని నేను అనుకోవడం లేదు. అవి నా విషయంలో సెట్‌ కాలేదు అంతే. అయినప్పటికీ ప్రేమ మీద నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది. ప్రేమను పంచడం, పొందడం అనేది నాకు చాలా ఇష్టం. అది దక్కాలంటే అదృష్టం ఉండాలి’’ అని పేర్కొన్నారు మలైకా ఆరోరా.

Videos

దద్దరిల్లుతున్న ఇరాన్.. ఖమేనీ ఫోటో కాల్చి సిగరెటికి నిప్పు

ఏపీలో వివాదాస్పదంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తీరు

అయ్యా ABN మెంటల్ కృష్ణ.. రాధా కృష్ణ తుక్కు రేగొట్టిన నాగమల్లేశ్వరి

మిగిలేది ఆవకాయ తొక్కే.. బాబు, పవన్ పై బైరెడ్డి సెటైర్లే సెటైర్లు

కండలేరు వద్దకు వెళ్తున్న YSRCP నేతల అక్రమ అరెస్ట్

చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం.. పండగ పూట కూలీల పస్తులు

మన శంకరవరప్రసాద్ గారు మూవీ పబ్లిక్ టాక్

సంక్రాంతి కిక్కు.. జీవో రాకముందే మద్యం ధరల పెంపు

దళపతి విజయ్ అరెస్ట్..?

దూసుకొచ్చిన కారు.. సాక్షి రిపోర్టర్ కు గాయాలు

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)

+5

సంక్రాంతి జోష్‌.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్‌ (ఫొటోలు)

+5

సాక్షి-ఎస్పీఆర్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు (ఫోటోలు)