Breaking News

25 ఏళ్లకే పెళ్లి.. ఆ తప్పు మాత్రం చేయొద్దు!

Published on Wed, 12/31/2025 - 10:51

అమ్మాయిలు.. మీకు చాలా లైఫ్‌ ఉంది.. వెంటనే పెళ్లి చేసుకోకండి అంటోంది బాలీవుడ్‌ బ్యూటీ మలైకా అరోరా. తనకు 25వ ఏటనే పెళ్లయిందని, ఆ తప్పు మరెవరూ చేయకూడదంటోంది. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ.. చిన్న వయసులో పెళ్లి చేసుకోకండి.. దయచేసి ఆ తప్పు చేయకండి. నేను అదే తప్పు చేశాను. కాకపోతే నా వైవాహిక జీవితంలో జరిగిన ఓ అందమైన విషయం ఏంటంటే బిడ్డను కనడం. 

వర్కవుట్‌ కాలేదు
అయినప్పటికీ నేను చెప్పేది ఒక్కటే ముందు లైఫ్‌ను ఆస్వాదించండి.. స్థిరపడేందుకు కొంత సమయం తీసుకోండి. ఆర్థికంగా, మానసికంగా స్వేచ్ఛ లభించాక జీవితంలో పెళ్లి చేసుకుని సెటిల్‌ అవండి అని సలహా ఇచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. పెళ్లి అనే సాంప్రదాయాన్ని నేను బలంగా నమ్ముతాను. కానీ ఎందుకో మరి నా విషయంలో వర్కవుట్‌ కాలేదు. విడిపోయాం.. నేను అక్కడే ఆగిపోకుండా జీవితంలో ముందుకు సాగాను. 

ప్రేమను పొందడం ఇష్టం
కొందరితో ప్రేమలో పడ్డాను. కానీ ఎన్నడూ విసుగుచెందలేను. ఇప్పటికీ నా లైఫ్‌ను నేను ఆస్వాదిస్తున్నాను. ప్రేమ అనే ఆలోచన నాకెంతో ఇష్టం. ప్రేమను పంచడం, పొందడం భలే ఇష్టం. అలా అని ఇప్పుడు నేను ప్రేమ కోసం ఎదురుచూడటం లేదు. ఒకవేళ అది నా ఇంటి తలుపు తడితే దాన్ని కాదనలేను, తప్పకుండా ఆహ్వానిస్తాను అని చెప్పుకొచ్చింది.

పెళ్లి- విడాకులు
చయ్య చయ్య, కెవ్వు కేక వంటి ఐటం సాంగ్స్‌తో పాపులర్‌ అయిన మలైకా అరోరా.. 25 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు, నటుడు అర్బాజ్‌ ఖాన్‌ను పెళ్లాడింది. వీరికి కుమారుడు అర్హాన్‌ ఖాన్‌ సంతానం. కొంతకాలానికి మలైకా - అర్బాజ్‌ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2017లో విడిపోయారు. తర్వాత అర్బాజ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ షురా ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. మలైకా.. హీరో అర్జున్‌ కపూర్‌తో ప్రేమాయణం నడిపింది, కానీ వీరి బంధం పెళ్లి పట్టాలెక్కేలోపు బ్రేకప్‌ చెప్పుకున్నారు.

చదవండి: చెప్పలేనంత బాధ.. భగవంతుడిని ఒకటే ప్రార్థిస్తున్నా: బండ్ల గణేశ్‌

Videos

CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ

నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.

వనమిత్ర యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులకు వేధింపులు

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

ఫుల్ ఫోకస్ లో ఉన్నాం ఏం చేయాలో అది చేస్తాం..

చైనాకు భారత్ బిగ్ షాక్ మూడేళ్లు తప్పదు

బాలీవుడ్ నటుడికి జోకర్ లుక్ లో ఇచ్చిపడేసిన ప్రభాస్!

అప్పన్న ప్రసాదంలో నత్త... నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్

తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

AP: కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు

Photos

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)

+5

హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)

+5

జనాలకు భరోసా కల్పిస్తూ జగన్‌ ప్రయాణం.. 2025 రౌండప్‌ చిత్రాలు

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భర్తతో హనీమూన్‌ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)

+5

రష్మిక రోమ్ ట్రిప్.. మరిది ఆనంద్‌తో కలిసి (ఫొటోలు)

+5

అన్షులా కపూర్ బర్త్ డే పార్టీ.. జాన్వీ కపూర్ మిస్సింగ్ (ఫొటోలు)